Bigg Boss 4 టాప్ 5లో ఉండేది వాళ్లే.. ఆ ఇద్దరి మధ్యే గట్టి పోటీ
బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్‌లో అందరికీ కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి. ఎవరి ఉద్దేశం ఏ కంటెస్టెంట్ బెస్ట్.. ఎవరు టాప్ 5లో ఉంటారు.. వంటి విషయాలెన్నో బయటకు వచ్చాయి. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో దాదాపు అన్నీ సరిగ్గానే. అరియానా ఫ్యామిలీ తప్పా మిగిలన వారంతా పబ్లిక్ పల్స్‌ను పట్టాలను. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్ దాదాపు నిజమయ్యే అవకాశాలే ఉన్నాయి.

వారే టాప్ 5..
బిగ్ బాస్ నాల్గో సీజన్ టాప్ 5 కంటెస్టెంట్లు దాదాపు ఖరారు అయ్యారు. అందులో మొదటి కంటెస్టెంట్ అభిజిత్ అందులో ఎలా వివాదం లేదు. సోహెల్ కూడా బెర్త్ కన్ఫామ్ చేసుకున్నట్టే. ఇక అఖిల్ కూడా టాప్ 5లో ఉంటాడని అర్థమైంది. ఇక నాల్గో స్థానంలో అరియానా ఉంటుంది. చివరగా ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరన్నది మాత్రం అందరికీ కాసింత అనుమానంగానే ఉంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలో హారిక కూడా టాప్ 5లో ఉంది.

అవినాష్‌కు షాక్..
బిగ్ బాస్ షో తన వల్లే నడుస్తోందని.. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వచ్చాను.. నేను ఎంటర్టైనర్ అని చెప్పుకునే అవినాష్‌కు నిన్నటి ఎపిసోడ్‌లో ఎదురుదెబ్బలు తగిలాయి. అరియానా ఫ్యామిలీ తప్పా మిగిలిన వారెవ్వరూ కూడా అవినాష్‌ను టాప్ 5లో ఉంటాడని చెప్పలేదు.

ముగ్గురిపై వేటు..
టాప్ 5లో కాకుండా మిగిలిన ముగ్గురైన మోనాల్, లాస్య, అవినాష్‌లకు వేటు పడనుందని తెలుస్తోంది. నేటి ఎపిసోడ్‌లో లాస్య ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా మోనాల్ అవినాష్‌లోంచి ఎవరొకరు వచ్చే వారంలో ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని టాక్. అయితే మోనాల్ వచ్చే వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటి నుంచే టాక్ నడుస్తోంది.

ఇ ఇద్దరి మధ్యే..
అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే టాప్ 2లో అభిజిత్ సోహెల్ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఇప్పటి నుంచే ఫైనల్ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక అరియానా మూడో స్థానానికి పరిమితమవుతుందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతోంది చూడాలి.


Click it and Unblock the Notifications











