కొట్టుకోండి అప్పుడే మజా ఉంటుంది.. ఇంట్లో గొడవలపై అభిజిత్ తల్లి రియాక్షన్ వైరల్
బిగ్ బాస్ షోలో ఒకే ఫార్మూలా ఉంటుంది. ఆ సూత్రాన్నే అన్ని సీజన్లలో వాడుతుంటాడు. కంటెస్టెంట్లు తమ ఫ్యామిలీని చూడకుండా, వారి మాటలు వినకుండా, వారికి దూరంగా ఉండటం.. అలాంటి వారిలో ఒక్కసారిగా ఉత్తేజాన్ని నింపేందుకు ఫ్యామిలీ టచ్ ఇస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్‌ను చూపించి వారిలో ఆనందాన్ని నింపుతాడు. గత సీజన్లలోనూ అలాంటివే జరిగాయి. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతోంది.

నేటి ఎపిసోడ్‌లో ఫ్యామిలీ టచ్..
బిగ్ బాస్ షోలో పదకొండో వారం ఫ్యామిలీ టచ్ ఇవ్వబోతోన్నాడు. ఇక కంటెస్టెంట్లు తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను చూసి ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఈ సారి మాత్రం అందరూ తల్లులే వచ్చారని అనిపిస్తోంది. హారిక, అభిజిత్, అఖిల్, అవినాష్ ఇలా అందరి తరుపున వారి మదర్ వచ్చింది.

పెళ్లిపై కామెంట్లు..
ఇక అవినాష్ వాళ్ల అమ్మ రావడంతో ఇంటి సభ్యులందరూ పెళ్లి విషయాన్ని ఎత్తాడు. ఊరికే పెళ్లి పెళ్లి అని చంపుతున్నాడని ఇంటిసభ్యులు ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ అలా అనకురా.. బయటకు రాగానే పెళ్లి చేస్తాను అని అవినాష్ వాళ్ల అమ్మ అనడంతో అందరూ నవ్వేశారు.

తెలుగు వచ్చిందా..
అఖిల్ తల్లి రావడంపై మోనాల్‌పై పంచ్‌లు వేయడం బాగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. అఖిల్ అలుగుతాడని సోహెల్ ఫిర్యాదు చేయడం, అలుగుతాడ్‌లే అంటూ అఖిల్ మదర్ రివర్స్ కౌంటర్ వేయడం బాగానే ఉంది. నాకు ఆడపిల్ల లేరు కానీ నీలాంటిదే కావాలి అంటూ హారికను అఖిల్ తల్లి ముద్దాడింది.

హారిక పరువుపాయే..
హారిక తన తల్లి దగ్గర గొప్పలు చెప్పుకునేందుకు ట్రై చేసింది. నిన్నటి టాస్కులో స్టార్ గెలిచాను కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించాను అని గర్వం చెప్పుకుంది. ఈ సారైనా గెలుస్తావా? అని హారికకు ఆమె తల్లి కౌంటర్ వేయడంతో అందరూ పగలబడి నవ్వేశారు.

కొట్టుకోండి అప్పుడే మజా..
అందరిలోకెల్లా అభిజిత్ మదర్ వేసిన పంచ్‌లు అదిరిపోయాయి. ఇంట్లో గొడవలు కేవలం టాస్కుల వరకు మాత్రమే పరిమితం అని అందరూ అంటుంటే.. కొట్టుకోండి అప్పుడే మజా ఉంటుంది అని అభిజిత్ తల్లి అందరికీ కౌంటర్ వేసింది. దీంతో అందరూ నవ్వేశారు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో ఫుల్ ఎమోషన్స్ ఉండేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











