Bigg Boss Unseen: సోహెల్‌కు అఖిల్ బాగానే ఎక్కించాడు.. హారికపై అందుకే అలా లేచాడా?

బిగ్ బాస్ షోలో పదో వారం కాస్త ప్రశాంతంగానే ముగిసింది. అయితే పదకొండో వారం ప్రారంభంలోనే పెద్ద యుద్దాలు జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియ అసెంబ్లీ సమావేశాలకంటే దారుణంగా మారిపోయాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకే దిగారు. వరెస్టె పర్ఫామెన్స్ ఇచ్చిన వారి పేరు చెప్పాలి.. లేదా ఇతర కారణాలేవైనా సరే చెప్పొచ్చు అని బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ ప్రక్రియ కంటే ముందే అఖిల్ సోహెల్ రాత్రి బాగానే చర్చించుకున్నారు.

దేఖరు అనే పదం..

దేఖరు అనే పదం..

చిచ్చుబుడ్డి ఆటంబాంబ్ అనే టాస్కులో హారిక సోహెల్ మధ్య దూరం పెరిగింది. సోహెల్ చిచ్చు బుడ్డి అని చెబుతూ తన కారణాలను చెప్పింది హారిక. ఇంట్లో అందరితో గొడవలు పెట్టుకోవాలని చూస్తాడు.. ఊరికే మీదమీదకు వస్తాడు కానీ ఎవ్వరూ దేఖరు పట్టించుకోరు అని సోహెల్ గురించి హారిక చెప్పింది. ఆ మాటనే పట్టుకుని హారికను సోహెల్ టార్గెట్ చేశాడు.

రాత్రి గుసగుసలు..

రాత్రి గుసగుసలు..

ఇదే విషయంపై రాత్రి సోహెల్ అఖిల్ చర్చించుకున్నారు. నెల్లూరు నుంచి ఓ ఫ్యాన్ హారికకు కాల్ చేయడం.. అతగాడు అడిగిన ప్రశ్నకు హారిక సమాధానం చెబుతూ ఇచ్చి పడేస్తా.. అని తనదైన శైలిలో చెప్పింది. తన జోలికి ఎవరైనా వస్తే ఇచ్చి పడేస్తా అని అంది కదా.. అసలు ఇచ్చి పడేయడం ఏంటో రేపు చూపిస్తా అని సోహెల్ అఖిల్‌తో చెప్పుకొచ్చాడు.

ఆ మాట ఎలా అంటుంది..

ఆ మాట ఎలా అంటుంది..

అసలు దేఖరు అని ఎలా అంటుంది.. ఎవ్వరూ దేఖక పోతే ఇంట్లో ఇలా ఉంటానా? వేస్ట్ గాడు, దేఖరు అనే మాటలు ఏంది? నాగార్జున సర్ ముందే చెబుదామని అనుకున్నాను.. ఆమె అలా అనడం నాకు నచ్చలేదని అంటూ అఖిల్‌తో రాత్రి చర్చలు పెట్టాడు సోహెల్. ఆమె ఒక్కత్తి దేఖరు అంటే ఏమి కాదురా అని సోహెల్‌ను అఖిల్ ఓదార్చాడు.

ఆ పాయింట్..

ఆ పాయింట్..

ఓ సారి తనను పొట్టి అన్నాడని నాగార్జున సర్ ముందే అవినాష్ గురించి చెప్పింది.. కదా అది తప్పు అని ఆమె ఫీలైతే.. నిన్ను ఆమె అలా అనడం కూడా తప్పే కదా అని సోహెల్‌కు ఓ పాయింట్ ఎక్కించాడు అఖిల్. అవును నిజమే అంటూ సోహెల్ కూడా వంత పాడాడు.

Recommended Video

Megastar Chiranjeevi Meets Legend Kalatapaswi K Vishwanath
 అందుకే అలా..

అందుకే అలా..

అందుకే సోహెల్ నామినేషన్ ప్రక్రియలో అవినాష్ పేరు తీసుకున్నాడు. ఆయన నిన్ను పొట్టి అంటే నువ్ ఎలా ఫీల్ అయ్యావో నేను కూడా అలానే అయ్యాను అంటూ హారిక మీదకు సోహెల్ మాటల తూటాలను వదిలాడు. ఆ విషయం నాకు అవినాష్‌కు మధ్య జరిగింది అది మేం చూసుకుంటాం నీకనవసరం అని హారిక కూడా గట్టిగానే వాదించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X