అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు.. అవినాష్‌కు ఎంత కష్టమొచ్చిందో!!
బిగ్ బాస్ షోలో పదో వారం మటన్ కోసం జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. రేషన్ మేనేజర్ అయిన అవినాష్ మటన్‌ను జాగ్రత్తగా భద్రపరచకపోవడంతో అది పాడైపోయింది. తమకిష్టమైన మటన్ పాడవ్వడంతో ఇంటి సభ్యులందరూ అవినాష్‌ను టార్గెట్ చేశారు. అందరూ కలిసి ఓ రేంజ్‌లో హింసించారు. అవినాష్‌కు నరకం చూపించారు. మరీ ముఖ్యంగా సోహెల్, మెహబూబ్ అవినాష్‌ను ఓ ఆటాడుకున్నారు.

గుడ్లు లాక్కున్నారు..
అవినాష్ మటన్ పాడు చేయడంతో అతని గుడ్లన్నీ మెహబూబ్, సోహెల్ తీసుకున్నారు. ఆ గుడ్లు కూడా కొన్ని పాడవ్వడంతో అవినాష్ మీద ఫైర్ అయ్యారు. స్విమ్మింగ్ పూల్‌లో తోసేసి అందరూ కలిసి కుమ్మేశారు. మటన్, గుడ్లు పాడు చేసిన విషయంలో అవినాష్‌ను దారుణంగా ఆడుకున్నారు. నామినేట్ చేస్తామంటూ బెదిరించారు.

బిగ్ బాంబ్ అలా..
ఇంట్లో రెండు వారాల పాటు నాన్ వెజ్ తినకూడదనే బిగ్ బాంబ్‌ను మోహబూబ్ అవినాష్ మీద వేశాడు. మటన్ పాడు చేసినందుకు శిక్షగా ఆ బిగ్ బాంబ్ తన మీదే వేయమని అవినాష్ కోరాడు. అయితే నాగార్జున మాత్రం ఆ శిక్షా కాలాన్ని తగ్గించాడు. రెండు వారాల పాటు కాకుండా ఒక వారం పాటు నాన్ వెజ్ ముట్టుకోకూడదని అన్నాడు.

ఊరిస్తోన్న సోహెల్..
ఇంటి సభ్యులందరి కోరిక మేరకు నాగార్జున ఓ కేజీ మటన్‌ను గిఫ్ట్‌గా పంపాడు నాగార్జున. అది స్పెషల్‌గా వండినట్టున్నారు. అసలే ఇళ్లు కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. ఈ సమయంలో మంచి ఎనర్జీ ఫుడ్ తినాల్సిన అవినాష్ బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. అది చాలదన్నట్టుగా సోహెల్ ఆ మటన్‌ను ఊరిస్తూ అవినాష్ ముందే తిన్నాడు.

ఇంతింత తినేవాడిని..
మటన్ ఎలా ఉందని లాస్య అడగడం.. వాసనతోనే మనట్ రుచి తెలుస్తోందని హారిక అనడం ఇలా మటన్‌ను చూపిస్తూ అవినాష్‌ను టెంప్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇంతింత తినే వాడిని అంటూ మటన్ వైపు జాలిగా చూశాడు అవినాష్. మరీ బిగ్ బాంబ్‌ను పక్కనపెట్టేయ్ అని లాస్య సలహా ఇచ్చింది. కానీ అవినాష్ మాత్రం నిష్టగానే మటన్‌ను ముట్టకుండా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











