ఆ నడక చూడు ముసలి దానిలా ఎలా ఉందో.. అరియానా పరువుదీసిన అవినాష్

బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ మొదట్లో కాస్త సీరియస్‌గానే అనిపించేది. అందరూ కూడా ఏదో నడుస్తోందని ఆసక్తిగా చూశారు. కానీ అరియానా పేల్చిన బాంబుతో ఆ ట్రాకులో ఉండాల్సిన మజా మొత్తంపోయింది. అరియానా తనకు బయట వేరే వాళ్లు ఉన్నారని చెప్పడం, అవినాష్ ఎప్పటికీ ఓ మంచి ఫ్రెండ్ అని స్పష్టంగా చెప్పడంతో అంతా తుస్సుమంది. అప్పటి నుంచి ఈ ట్రాకును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎంత కామెడీ చేసినా సరసాలు ఆడినా ఎవ్వరూ ఆసక్తిని చూపడం లేదు.

గత వారంలో అలా..

గత వారంలో అలా..

గతం వారంలో మెహబూబ్ అవినాష్ అరియానా ఓ చోట కూర్చుని ముచ్చట్లు పెట్టారు. అరియానా బాగుంది కదా అని పులిహోర కలపడం మొదలెట్టాడు అవినాష్. నువ్ ఎంత చేసినా పడను అని అరియానా కౌంటర్ వేయడంతో అవినాష్ ఫీలయ్యాడు. మనం ఫ్రెండ్స్ కదా పడిపోవడం ఏంటి పడగొట్టడం ఏంటి? అయినా మనిద్దరికి అంత సీన్ లేదంటూ అవినాష్ కవర్ చేసేశాడు.

 తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మార్నింగ్ మస్తీ సాంగ్‌లో డ్యాన్స్ చేసేశాక.. అవినాష్ అరియానాను ఆటపట్టించాడు. ముసల్దానిలా ఆ నడుము, నడక చూడు అంటూ కౌంటర్ వేశాడు. ఆ కౌంటర్‌కు అఖిల్ నవ్వాడు. ఏంటి అంకుల్.. వెనుక ఆ బొజ్జ టైర్లు అంటూ అవినాష్ పరువు అరియానా తీసేసింది. ఓ పెళ్లి కాని మగాడిని అలా వర్ణిస్తావా? అంటూ అరియానాను అవినాష్ నిలదీశాడు.

సోహెల్ మంటపెట్టాడు..

సోహెల్ మంటపెట్టాడు..

అరియానా అవినాష్ అలా పోట్లాడుకుంటూ ఉంటే సోహెల్ మధ్యలో మంటపెట్టాడు. అరియానాతో నువ్ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నావని చెప్పావ్ కదా అని అవినాష్‌ను ఇరికించాడు. సోహెల్‌కు తోడుగా అఖిల్ కూడా జత కలిశాడు. వామ్మో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ అట.. తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు క్లియర్‌గా చెప్పు అని అఖిల్ అంటే... సహజీవనం అని అరియానా చెప్పింది.

Recommended Video

Megastar Chiranjeevi Meets Legend Kalatapaswi K Vishwanath
ఇలాంటివాడివా?

ఇలాంటివాడివా?

సహజీవనం అంటే అని అఖిల్ ఏదో ఒకటి చెబుతూ ఆ చిచ్చును ఇంకాస్త పెంచేందుకు ప్రయత్నించాడు. చీచీ నువ్ ఇలాంటి వాడివా? అది తెలియక నీతో ఇన్ని రోజులు మాట్లాడాను.. అందుకేనా నువ్ నన్ను ముసల్దానా? ఆంటీ అంటున్నావ్ అంటూ ఇలా అవినాష్ మీద అరియానా సెటైర్లు వేస్తూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X