హాట్ టాపిక్.. కుమార్ సాయి రీ ఎంట్రీ.. ఇక ఆట ఎలా మారుతుందో!!
బిగ్ బాస్ నాల్గో సీజన్‌ను లేపేందుకు చేయని ప్రయత్నమంటూ ఏది లేదు. వరుసగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ (కుమార్ సాయి, స్వాతీ దీక్షిత్, అవినాష్) లను ప్రవేశపెట్టాడు. కానీ అవి అంతగా వర్కవుట్ కాలేదు. టాస్కుల్లోనూ ఎలాంటి కొత్తదనం చూపించలేదు. ఏమైనా ట్విస్ట్‌లు ఇద్దామంటే ముందుగానే లీకవుతున్నాయి. అది బిగ్ బాస్ షోకు పెద్ద మైనస్ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే కంటెస్టెంట్లు అనారోగ్యానికి గురవుతున్నారు. మధ్యలో వెళ్తున్నారు. గంగవ్వ, నోయల్ అలానే వెళ్లిపోయారు. భుజానికి అయిన గాయం వల్ల అభిజిత్ ఫిజికల్ టాస్కుల్లో పార్టిసిపేట్ చేయడు. ఇలా ఇళ్లంతా గందరగోళంగా మారింది. ఇలాంటి సమయంలో కుమార్ సాయి రీ ఎంట్రీ అన్న వార్తలు అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి.

ఎలిమినేషన్స్..
అయితే ఈ నాల్గో సీజన్ ఎలిమినేషన్ ప్రక్రియపై అందరూ గుర్రుగానే ఉన్నారు. జనాల ఓటింగ్ బట్టి ఎలిమినేషన్ జరగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడో వారంలో దేవీ నాగవల్లి, ఆరో వారంలో కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. అవి తప్పుడు ఎలిమినేషన్లు అని వారిని తిరిగి ఇంట్లోకి తీసుకురండని కోరారు.

సీక్రెట్ రూం కూడా..
అలా ఎలిమినేషన్స్ విషయంలో బిగ్ బాస్ టీంకు ఎదురుదెబ్బలు తగిలాయి. అఖిల్ సీక్రెట్ రూం ప్లాన్ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అదేమీ జనాల్లో అంతగా ప్రభావం చూపలేదు. అయితే గత సీజన్‌లో పదకొండో వారంలో ఓ మ్యాజిక్ జరిగింది. అదే అలీ రెజా రీ ఎంట్రీ. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ టాపిక్ వైరల్అవుతోంది.

కుమార్ సాయి రీ ఎంట్రీ..
గత సీజన్లో మాదిరిగానే ఈ సారి కూడా ఓ కంటెస్టెంట్ రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడని, అది కూమార్ సాయి అంటూ నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. కుమార్ సాయి రీ ఎంట్రీ ఫిక్స్ అయిందని నెటిజన్లు చేస్తోన్న కామెంట్లలో నిజమెంతో తెలియదు కానీ అది నిజమైతే మాత్రం ఆట యూటర్న్ తిరుగుతుంది.

కథలో ట్విస్ట్‌లు...
ఒక వేళ నెటిజన్ల భవిష్యవాణి నిజమై.. కుమార్ సాయి రీ ఎంట్రీ ఇస్తే ఎవరితో ఉంటాడు.. ఎవరి వైపు నిలబడతాడు.. ఇన్ని రోజులు బయట ఎంతో గమనించాడు.. ఎవరికైనా మద్దతుగా నిలుస్తాడా? లేదా మళ్లీ సొంతంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడా? ఇలా ఎన్నో రకాలుగా ఆటలో కొత్త ట్విస్ట్‌లు వస్తాయి. సోహెల్‌కు కరెక్ట్‌గా సమాధానం ఇచ్చే కుమార్ సాయి గనుక రీ ఎంట్రీ కథ వేరేలా ఉంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











