కన్ను కొట్టిన హారిక.. సోహెల్‌ను అలా బక్రా చేసింది!!
బిగ్ బాస్ షోలో పదకొండో వారం కొన్ని చిత్రవిచిత్రాలు జరిగాయి. పదకొండో వారం నామినేషన్స్ ప్రక్రియలో సోహెల్ హారిక ఏ రేంజ్‌లో పోట్లాడుకున్నారో అందరికీ తెలిసిందే. నామినేషన్స్ కారణాలు చెబుతూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. మరీ ముఖ్యంగా సోహెల్ మాత్రం హద్దులు దాటేశాడు. బాడీ షేమింగ్ చేస్తూ గింతం లేవు పొట్టి అంటూ దారుణంగా మాట్లాడాడు. ఆవేశంలో ఎన్నో మాటలు తూలిన సోహెల్.. ఎలిమినేషన్‌కు టిక్కెట్ తీసుకున్నాడని అందరూ అనుకున్నారు.

మళ్లీ కలిసిపోయారు..
అయితే నామినేషన్స్ జరిగిన మరుసటి రోజు మళ్లీ ఒక్కటయ్యారు. అయితే ఆ గొడవ, ఆ చర్చ అంత కేవలం నామినేషన్స్ వరకే మనసులో ఉంచుకున్నట్టున్నారు. ఆ తరువాత మళ్లీ ఇద్దరూ మంచి స్నేహితుల్లానే కలిసిపోయారు. హారిక అమ్మ జ్యోతి వచ్చినప్పుడు కూడా పొట్టి అనే మాటలపై క్లారిటీ ఇచ్చింది.

పొట్టిలోనే పోటీ..
నిన్ను పొట్టి అన్నారని ఫీల్ అవ్వకు ఆ పొట్టిలోనే పోటీ ఉందని, నువ్ గట్టిదానివి అనిఅందరికీ చెప్పు అని సోహెల్‌ను ఉద్దేశించి.. హారికకు చెప్పింది. అయితే తన అమ్మ చెప్పిన మాటలు పొట్టి అనే వ్యాఖ్యలను హారిక సరిగ్గా అర్థం చేసుకోలేదేమో గానీ సోహెల్‌కు బాగానే అర్థమైంది. నా గురించే చెప్పింది మీ అమ్మ.. అంటే మన నామినేషన్స్ బాగానే వైరల్ అయ్యాయని సోహెల్ హారికతో చెప్పుకొచ్చాడు.

కలిసిపోయాం..
అయితే ఆ నామినేషన్స్ గొడవలన్నీ అక్కడికే ఉంటాయని, తరువాత తామంతా కలసిపోతామని సోహెల్, హారికలు వచ్చిన పేరెంట్స్‌తో చెప్పుకొచ్చారు. అలాంటివి గొడవలు చిన్న చిన్నగా అవుతుంటాయి.. మళ్లీ కలిసి పోతామని చెప్పుకొచ్చారు. అయితే ఈ వారంలో మాత్రం సోహెల్ హారికలు బాగానే క్లోజ్ అయ్యారు.
Recommended Video

అలా బక్రాను చేసింది..
తాజాగా వదిలిన ప్రోమోలో హారిక సోహెల్ అవినాష్‌లు గార్డెన్ ఏరియాలోని సోఫాలో కూర్చున్నారు. సోహెల్‌ను మాటల్లో పెట్టి.. బిగ్ బాస్ కెమెరాలకు కన్ను గొట్టిన హారిక అతడ్ని బక్రాను చేసింది. చేతి మీద రుద్దుతూ ఏదో పర్ఫ్యూమ్ వాసన వస్తుందని, చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను ఆడింది. సోహెల్ తన చేత్తో తన మొహాన్ని కొట్టుకునేలా చేసింది.


Click it and Unblock the Notifications











