అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్!!.. తల్లి మాటలకు ఖంగుతిన్న మోనాల్
బిగ్ బాస్ షోలో ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతీ కంటెస్టెంట్ అందరికీ నచ్చాలన్న నియమం ఏమీ లేదు. చివరకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన కంటెస్టెంట్లు కూడా కొంతమందికి నచ్చరు. కానీ మెజార్టీ శాతం ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారే విజేతలుగా నిలుస్తారు. అలా ఈ సీజన్‌లో అభిజిత్‌కు ఇప్పటికైతే భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే విచిత్రంగా మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్ అయ్యాడు. మొన్నటి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎమోషన్ పండించిన ఎపిసోడ్‌లో అందరూ అభిజిత్‌ను స్పెషల్‌గా ట్రీట్ చేశారు.

అందరూ అభిజిత్‌పైనే..
ఇంట్లోకి వచ్చిన అఖిల్ తల్లి దుర్గ, హారిక అమ్మ జ్యోతి, అరియానా ఫ్రెండ్ వినీత్ ఇలా అందరూ అభిజిత్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించారు. అయితే ఒక్క మోనాల్ సిస్టర్ మాత్రమే అభిజిత్ గురించి నెగెటివ్‌గా చెప్పింది. ఏదైనా ఉంటే ముందు మాట్లాడు.. వెనకలా మాట్లాడకు అని కౌంటర్ వేసింది. అయితే మోనాల్ మదర్ మాత్రం తాజాగా దానికి భిన్నంగా స్పందించింది.

నేటి ఎపిసోడ్‌లో అలా..
ఇక నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మరోసారి కంటెస్టెంట్లకు తమ ఇంటిసభ్యుల ప్రేమను చూపించాడు నాగార్జున. కంటెస్టెంట్ల తల్లి,తండ్రి, సోదరుడు ఇలా ఒక్కొక్కరిని స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారితోనే ఓ ఆట ఆడించినట్టున్నాడు.

టాప్ 5లో ఎవరుంటారు..
కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్.. తమ దృష్టిలో టాప్ 5 ఎవరుంటారు.. చివరి వరసలో ఎవరుంటారు? అని చెప్పించాడు. అందులో భాగంగా మోనాల్ తల్లి మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. మోనాల్ కాకుండా ఇంట్లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం.. ఫేవరేట్ అని అడిగాడు నాగార్జున.
అభిజిత్ ఫేవరేట్..
మోనాల్ సిస్టర్ మాత్రం అభిజిత్‌కు వ్యతిరేకంగా చెప్పింది. కానీ తల్లి మాత్రం అభిజిత్ తన ఫేవరేట్ కంటెస్టెంట్ అని చెప్పి షాకిచ్చింది. తల్లి మాటలతో మోనాల్ ఖంగుతింది. అభిజిత్ సర్‌ప్రైజింగ్‌గా ఫీలయ్యాడు. ఇలా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకు రావడంతో నేటి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌గా సాగనున్నట్టు కనిపిస్తోంది.

అవినాష్‌కు షాక్..
అందరి ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకు వచ్చారు. కానీ అవినాష్ విషయంలో మాత్రం ఫిట్టింగ్ పెట్టాడు. ఇంట్లో సెల్ఫీష్ ఎవరో చెప్పాలి.. అప్పుడే నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్‌ను చూపిస్తాను అని నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అయితే అవినాష్ లాస్య పేరు చెప్పడం, అది తప్పు అని నాగార్జున చెప్పడం జరిగింది. దీంతో తన కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం అవినాష్ లేదని ఓ డ్రామా ప్లే చేయించాడు. మరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











