టోటల్ డ్యామేజ్.. మాటలు జారిన సోహెల్.. ఆడేసుకుంటోన్న నెటిజన్లు
బిగ్ బాస్ షో ఇక ముగింపుకు వస్తోంది.. ఇంట్లో కంటెస్టెంట్ల సంఖ్య తక్కువ అవుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్నది ఎనిమిది మంది సభ్యులే. అయితే పదకొండో వారం నామినేషన్ ప్రక్రియ హీటెక్కించేలానే ఉంది. ఒకరిపై ఒకరు విరుచుకుపడేలానే కనిపిస్తున్నారు. ఈ ఎనిమిది మందిలో హారిక, లాస్య, అభిజిత్‌లు ఒకవైపు. అవినాష్ అరియానా మరో వైపు. అఖిల్ మోనాల్ సోహెల్ ఓజట్టుగా ఉంటారు. ఇక నామినేషన్స్‌లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనే విషయం ఈజీగా చెప్పొచ్చు.
Recommended Video

ఆ ముగ్గురిపై..
హారిక, లాస్య, అభిజిత్‌లు ఎలాగూ నామినేట్ అవుతారు. అఖిల్ సీక్రెట్ రూం కారణాలను చెబుతూ ఇద్దరిని ఆ గ్రూపులోంచే నామినేట్ చేస్తాడు. ఇక అరియానా అవినాష్‌లు కూడా దాదాపు అదే గ్రూపును టార్గెట్ చేస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే సోహెల్ మాత్రం ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్టు ప్రోమోలో కనిపిస్తోంది.

మళ్లీ పాత సోహెల్..
ఒకప్పుడు సోహెల్ తన కోపం కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంకెన్నో సార్లు నామినేట్ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన సలహాతో కోపాన్ని కాస్త తగ్గించుకున్నాడు. మాటలు కూడా పొదుపుగానే మాట్లాడుతున్నాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం పాత సోహెల్ వచ్చినట్టు కనిపిస్తోంది.

హారికపై ఫైర్..
మొన్నటి టాస్క్‌లో హారిక సోహెల్‌ను అన్న మాటలు నామినేషన్స్‌లో ప్రభావం చూపెట్టాయి. సోహెల్ చిచ్చుబుడ్డి.. అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు.. దేఖరు అంటూ చెప్పింది. ఆ మాటలకు సోహెల్ హర్ట్ అయ్యాడు. అదే విషయాన్ని నామినేషన్స్‌లో ప్రస్తావించాడు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం గట్టిగానే జరిగేట్టు కనిపిస్తోంది.

గింతంత లేవు..
అయితే హారికతో మాట్లాడుతున్న సోహెల్ మాటలు జారాడు. ఇదే విషయం సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. గింతంత లేవు మాట్లాడుతున్నావ్ నీ చట్.. అంటూ ఘోరంగా అవమానించినట్టు మాట్లాడాడు. సోహెల్ మాట తీరు, ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చూస్తుంటే సోహెల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తోంది.

నెటిజన్ల కామెంట్స్
మాస్ అన్నావ్.. హారిక కామెడీ మాటలను ఎందుకు తీసుకోలేకపోతున్నావ్ అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి మాటలు అంటున్నందుకు అభిజిత్ నిన్ను నామినేట్ చేస్తున్నాడు. కానీ మళ్లీ నాకు అలాంటి బ్రో మాటలు రావు అంటూ అఖిల్‌తో చేరి వాట్సప్ బ్రో అనిఎగతాళి చేస్తున్నావ్ అంటూ సోహెల్ మీద విరుచుకపడుతున్నారు. ఇప్పటి వరకు నీ మీద గౌరవం ఉండే కానీ ఓ అమ్మాయిని అలా అనడంతో గౌరవం పోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరో వైపు సోహెల్ అభిమానులు మాత్రం సూపర్.. ఇచ్చిపడేశావ్.. మాస్ అంటూ పొగిడేస్తున్నారు.


Click it and Unblock the Notifications











