ఇండియా మొత్తంగా ట్రెండ్.. నాగార్జునపై విపరీతమైన ట్రోలింగ్.. అభిజిత్ హవాకు నిదర్శనం
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో అభిజిత్‌కు వచ్చిన క్రేజ్, పెరిగిన ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అది కొందరు పెయిడ్ పీఆర్ అంటూ కొట్టిపారేస్తుంటారు. కానీ అది జెన్యూన్ టాక్, అభిజిత్ తన ప్రవర్తన, వ్యక్తిత్వంతో సంపాదించుకున్న క్రేజ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. ఎలాంటి ఎమోషన్ అయినా కంట్రోల్ చేసుకుని స్ట్రాంగ్‌గా నిలబడే కంటెస్టెంట్‌ను ఈ పన్నెండో వారంలో ఎమోషనల్ అయ్యేట్టు చేశాడు.

మోనాల్‌తో వద్దు మొర్రో..
మోనాల్ అభిజిత్ అఖిల్ ట్రాకును బిగ్ బాస్ టీం ఎంతగా ప్రొజెక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. హోస్ట్ నాగార్జున కూడా ప్రతీ సారి ఆ ట్రయాంగిల్ ట్రాకును పైకి లేపేందుకు బాగానే కష్టపడ్డాడు. కానీ అభిజిత్ మాత్రం దండం పెట్టేశాడు. మోనాల్‌తో తనకు ఎలాంటి ఫిట్టింగ్ పెట్టకండని వేడుకున్నాడు.

మొదటి సారిగా ఎమోషనల్..
అయినా సరే మొన్నటి టాస్క్‌లో మళ్లీ లింక్ పెట్టే ప్రయత్నం చేశారు. మోనాల్‌ను ఏడిపించిన కారణంగా అభిజిత్ అఖిల్‌లు ఇద్దరిలో ఎవరో ఒకరు ఆమెను డేట్‌కు తీసుకెళ్లాలని టాస్క్ ఇచ్చారు. ఆ విషయంలో అభిజిత్ ఎమోషనల్ అయి.. ఏడ్చేసినంత పని చేశాడు. తాను మోనాల్‌తో డేట్‌కు వెళ్లను అని బిగ్ బాస్‌తో విన్నవించుకున్నాడు. టాస్క్ చేయకుండా వదిలేశాడు. అలా మొదటిసారిగా అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.

నాగార్జున ఫైర్..
అభిజిత్ అఖిల్ మీ ఇద్దరూ మోనాల్‌ను బాగా ఏడిపించారన్న సెంటెన్స్ నాకు నచ్చలేదు అని అభిజిత్ అనడం.. ఆ మాటలో ఏదైనా తప్పు ఉందా? అభిజిత్ అని నాగ్ రివర్స్ అయ్యాడు. నేను అయితే ఏడిపించలేదు అని అభిజిత్ అనడంతో అభిజిత్ మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించాడు నాగార్జున. అందులో ఏమీ పెద్ద సీరియస్ మ్యాటర్ కూడా లేదు. అయినా కూడా అభిజిత్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని నాగార్జున, బిగ్ బాస్ టీంను ఏకిపారేస్తున్నారు.

ప్రోమో వైరల్..
నువ్ చెప్పిన మాటలే బిగ్ బాస్ కూడా టాస్క్‌లో పంపించాడు అని నాగార్జున చెప్పాడు. ఆ విషయం నేను ఒప్పుకుంటాను సారీ సర్.. అంటూ అభిజిత్ చెప్పుకొచ్చాడు. ఇదేమీ మొదటి సారీ కాదు నువ్ తప్పు చేస్తావ్.. మళ్లీ క్షమించమని అడుగుతావ్.. చేస్తావ్.. అడుగుతావ్ అంటూ అభిజిత్‌ను నిలబెట్టి మరీ పరువుదీశాడు. నువ్ టాస్క్ చేయలేదు.. అది బిగ్ బాస్ రూల్ ప్రకారం తప్పు.. ప్లీజ్ ఓపెన్ గేట్స్ అంటూ అభిజిత్‌ను భయపెట్టే ప్రయత్నం చేశాడు నాగార్జున.

ఆడుకుంటున్న నెటిజన్లు..
అయితే అభిజిత్‌ను ఇలా టార్గెట్ చేయడంతో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. హోస్ట్‌గా నాగార్జున పనికి రాడని, షోను ఫాలో అవ్వకుండా ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతుంటాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నాడు. దేవదాస్ సినిమా ప్రమోషన్స్ టైంలో నాగార్జున బిగ్ బాస్ షో గురించి మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ పరువుదీస్తున్నారు.
Recommended Video

పలు రకాల కామెంట్లు..
మొత్తానికి అభిజిత్ ఫ్యాన్స్ #StopTargetingAbijeet అనే హ్యాష్ ట్యాగ్‌తో తమ సత్తా చాటుతున్నారు. అయితే అభిజిత్ ఫ్యాన్స్ ఇలా ట్రోల్స్ చేయడంపై కొందరు తప్పుబడుతున్నారు. నాగార్ణున స్థాయి ఏంటి అభిజిత్ స్థాయి ఏంటి.. నాగ్‌ను అనేంత దమ్ముందా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అభి ఫ్యాన్స్ చేస్తోన్న ట్రెండ్ నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











