అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. అర్థం కాని అభిజిత్ వ్యవహారం!
బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్డ్ కంటెస్టెంట్ అన్న పేరు తెచ్చుకున్నాడు అభిజిత్. బయట ఇప్పుడు అభిజిత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఫైనల్స్‌లో టైటిల్ గెలిచేది అభిజిత్ అంటూ ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఓట్ల సరళి కూడా అలానే ఉంది. సేవ్ చేయడానికే ఇలా ఓట్లు పడుతుంటే గెలవడానికి ఇంకెలా పడుతాయో అని అందరూ ఆశ్చర్యపడుుతున్నారు. కాసేపు ఆ విషయాలు పక్కనపెడదాం. నిన్నటి ఎపిసోడ్‌లో అభిజిత్ మొదటి సారిగా కన్నీరుపెట్టుకున్నాడు.

మొదటి నుంచి..
బిగ్ బాస్ టీం మొదటి నుంచి అభిజిత్ మోనాల్‌కు లింకు పెట్టి ఓ ట్రాకు నడుపుదామనే ప్లాన్‌లో ఉంది. అది కొన్ని రోజుల వర్కవుట్ అయింది కూడా. మధ్యలో అఖిల్ రావడంతో అది ట్రయాంగిల్ కథలా మారింది. అయినా కూడా కొన్ని వారాలు బాగానే నడించింది. ఆ తరువాత వ్యవహారం తేడా కొట్టడం ప్రారంభించింది. దాంతో అభిజిత్ మోనాల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

అటూ ఇటూ..
అయితే మోనాల్‌తో దూరంగా ఉండాలని అభిజిత్ ప్రయత్నించినా అది కుదరడం లేదు. వీకెండ్‌లో నాగార్జున వచ్చి కలిపేందుకు ప్రయత్నిస్తాడు. మాకు ఇలానే ఉంది.. అసలు మేం ముందు నుంచి కూడా మాట్లాడకుండా ఉంటేనే బాగుండేదేమో అని చెప్పుకొచ్చారు. అయితే అది కూడా బాగానే ఉంది. కానీ మొన్నటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరూ దగ్గరయ్యారేమో అనే సందేహం కలిగింది.

నిన్నటి ఎపిసోడ్‌లో అలా..
దెయ్యం ఇచ్చిన ఓ టాస్క్.. అందులో ఓ లైన్ నచ్చకపోవడంతో అభిజిత్ ఏడ్చేశాడు. అభిజిత్ అఖిల్ ఇధ్దరూ మోనాల్‌ను ఏడిపించారు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు డేట్‌కు తీసుకెళ్లాలని ఆ దెయ్యం ఓ టాస్క్‌ను ఇచ్చింది. మోనాల్ టాపిక్‌లోకి నన్ను ఎందుకు లాగుతున్నారు.. నాకు ఆమెతో వద్దని చెబుతుంటే మళ్లీ మళ్లీ ఆమెతో ఎందుకు లింక్ పెడతారంటూ వాపోయాడు.
Recommended Video

అర్థం కాని వ్యవహారం ఇదే..
అయితే ఇలా ఇంతలా ఎమోషనల్ అయిన అభిజిత్ మొన్న స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చుని ముచ్చట్లు ఎందుకు పెట్టాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మా నాన్నకు నచ్చావ్.. నేను మీ అమ్మకు నచ్చాను అంటూ కబుర్లు చెప్పడం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. ఏది ఏమైనా అభిజిత్ మోనాల్ విషయంలో గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











