శ్మశానవాటికలో డేటింగ్.. మళ్లీ అవే పాత ముచ్చట్లు.. మోనాల్-అఖిల్ ఇక మారరు!
బిగ్ బాస్ షోలో పన్నెండో వారంలో దెయ్యం రచ్చ రచ్చ చేస్తోంది. ఆ దెయ్యం కంటే కంటెస్టెంట్లు మరింత రచ్చ చేస్తున్నాడు. పెళ్లి కాని దెయ్యాన్ని పంపించమని అవినాష్ అడిగితే.. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చావ్ అంటూ అవినాష్‌ను అఖిల్ ఆడుకున్నాడు. సోహెల్, హారికలు దెయ్యాన్నే ఎగతాళి చేయడం ప్రారంభించారు. దెయ్యాన్ని చూసి అరియానా అయితే దెబ్బకు దడుసుకుంది. ఇలా దెయ్యంతో అందరూ బాగానే కామెడీ చేశారు.

వెరైటీ టాస్కులు..
ఇక దెయ్యం తనది తాను పరిచయం చేసుకుంది. తన పేరు జలజ అంటూ ఇంట్లోని ఒక్కొక్క సభ్యుల గురించి చెప్పడం ప్రారంభించింది. అంతే కాకుండా ప్రతీ ఒక్కరికీ వెరైటీ టాస్కులు ఇచ్చింది. పాటలు వచ్చిన ప్రతీసారి సోహెల్ పోల్ డ్యాన్సులు చేయాలని అంది. చెట్టు మీద ఎన్ని ఆకులున్నాయో చెప్పమని అభిజిత్‌కు టాస్క్ ఇచ్చింది.

ఇక డేటింగ్‌తో ఫిట్టింగ్..
అభిజిత్ అఖిల్‌లు ఇద్దరూ కూడా మోనాల్‌ను ఏడిపించారు.. కాబట్టి ఆమెను ఇప్పుడు డేట్‌కు తీసుకెళ్లాలని దెయ్యం టాస్క్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో అభిజిత్ అఖిల్ ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. మోనాల్ ఏడిపించారని ఎలా అంటారంటూ అభిజిత్ కన్నీరు పెట్టుకున్నాడు. మొదటిసారిగా అభిజిత్ ఇలా ఎమోషన్ అయ్యాడు.

అఖిల్‌కు అప్పగించాడు..
అయితే అభిజిత్ మోనాల్‌తో డేటింగ్‌కు వెళ్లనని చెప్పడంతో బిగ్ బాస్ ఆ టాస్కును అఖిల్‌కు అప్పగించాడు. ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్.. దెయ్యం చెప్పిన ప్రతీ పనిని చేయాల్సి ఉంటుందని అన్నాడు. అలా బిగ్ బాస్ ఆదేశించడంతో అఖిల్ మోనాల్‌ను తీసుకుని గార్డెన్ ఏరియాలో ఉన్న శ్మశాన వాటికలోకి తీసుకెళ్లాడు.

కొత్తగా పరిచయం..
కొత్తగా పరిచయాలు చేసుకుందాం..పాతవన్నీ పక్కన పెట్టేద్దామని డేట్‌ను ప్రారంభించారు అఖిల్ మోనాల్. అఖిల్ తన గురించి చెబుతూ.. ఎక్కువ పొసెసివ్.. ఎక్కువ ప్రొటెక్టివ్.. నా మనిషి అంటే నాతోనే ఉండాలని కోరుకుంటాను అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

మోనాల్ కూడా..
ఇక మోనాల్ కూడా తన గురించి పరిచయం చేసుకుంది. తాను కూడా అంతేనని, నా వాళ్లు నాతో ఎంత క్లోజ్‌గా ఉంటాడో.. మిగతా వాళ్లతో అంతే క్లోజ్‌గా ఉంటే భరించలేను అని చెప్పింది. మోనాల్ మాటలకు అఖిల్ కౌంటర్ వేశాడు. నువ్ మాత్రం అందరితో క్లోజ్‌గా ఉంటావ్ అంటూ పరోక్షంగా మళ్లీ ఆ ట్రయాంగిల్ కథనే తీసుకొచ్చాడు. మొత్తానికీ వీళ్ల డేట్ అలా పూర్తయింది. డేట్‌కు వెళ్లిన సమయంలోనూ మళ్లీ పాత విషయాలు మాట్లాడుకుంటారేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











