Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోనాల్ భుజం మీద నుంచి చెయ్యి తీసేయ్.. ఆ టాస్క్‌లో అవినాష్‌కు అఖిల్ కౌంటర్
బిగ్ బాస్ షోలో అఖిల్ మోనాల్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. మొదట ట్రయాంగిల్లా వర్కవుట్ చేద్దామని చూసిన టీంకు అభిజిత్ సైడ్ అయిపోవడంతో కథ మెయిన్ ట్రాక్‌లోకి ఎక్కింది. అఖిల్ మోనాల్ స్టోరీలో అప్పుడప్పుడు కామెడీగా అవినాష్ ఎంట్రీ ఇస్తుంటాడు. అలా అరియానా అవినాష్, మోనాల్ అఖిల్ జంటలు బాగానే టైం పాస్ చేస్తుంటాయి. ఒక్కోసారి మోనాల్‌ను అవినాష్ ఫ్లర్ట్ చేస్తుంటే.. అరియానాతో అఖిల్ పులిహోర కలుపుతుంటాడు.
రీసెంట్గా అలా..
పన్నెండో వారంలో అఖిల్ అరియానా రొమాన్స్ మామూలుగా లేదు. నీళ్లు పోసినా కిందకు జారనంత దగ్గరగా అతుక్కుని కూర్చున్నాం చూడంటూ అఖిల్ అవినాష్‌ను ఉడికించాడు. ఇక అవినాష్‌కు కోపం ఎక్కువైంది. వెంటనే మోనాల్‌ను రంగంలోకి దించి అఖిల్‌ను ఏడిపించాలని చూశాడు. కానీ మోనాల్ అంతగా సహకరించలేదు.
తాజాగా టాస్క్‌లో..
శనివారం నాటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులు బాగానే టాస్కుుల ఆడారు. శుక్రవారం రోజు ఇంటి సభ్యులకు బాగానే టాస్కులు ఇచ్చాడు. అందులో పంకజ్ కస్తూరీ బ్రీత్ ఈజీ అనే ఓ టాస్కులో అవినాష్‌కు స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. అందరికీ శ్వాస ఎలా తీసుకోవాలో నేర్పించమని బిగ్ బాస్ తెలిపాడు.
అందరూ కౌంటర్లు వేసేశారు..
బ్రీత్ ఈజీ అంటూ శ్వాస ఎలా తీర్చుకోవాలో అందరికీ నేర్పమని అవినాష్‌కు బిగ్ బాస్ బాధ్యతలు అప్పగించాడు. అసలే అవినాష్‌కు యోగా, ధ్యానం వంటివి రావు. దీంతో మిగతా కంటెస్టెంట్లు అవినాష్‌ను ఆడుకున్నారు. కళ్లు మూసుకుని నేను ఎలా చేస్తానో అలా చేయండని అవినాష్ తెలిపాడు. కళ్లు మూసుకుంటే నువ్ చేసేది మాకెలా కనిపిస్తుందని హారిక కౌంటర్ వేసింది.
మోనాల్ వచ్చి..
ఇక అవినాష్ అతి కష్టం శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటూ ఏదేదో కష్టపడ్డాడు. తప్పుగా చెబుతున్నావ్ అంటూ మోనాల్ వచ్చి అవినాష్ బాధ్యతలను తీసుకుంది. ఇక అవినాష్ కూడా కవర్ చేసేందుకు బాగానే ట్రై చేశాడు.
Recommended Video
చెయ్యి తీసి మాట్లాడు..
అయితే మోనాల్ అవినాష్ పక్కన కూర్చుని శ్వాస ఎలా తీసుకోవాలో చూపించింది, ఆ సమయంలో అవినాష్ మోనాల్ భుజం మీద చేయి వేశాడు. ఆ విషయాన్ని అఖిల్ గమనించి.. మోనాల్ మీద చేయి తీసి మాట్లాడు అంటూ సెటైర్ వేశాడు. మొత్తానికి మోనాల్ ఆ టాస్కును పూర్తి చేసేసింది.