అభిజిత్‌తో మళ్లీ అదే గొడవ.. అరేయ్ ఆగురా నువ్.. సోహెల్‌పై అఖిల్ ఫైర్

బిగ్ బాస్ షోలో ముగింపు ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇక ఫైనల్ రేసు మొదలైందని బిగ్ బాస్ తెలిపాడు. ఇక నుంచి షాకుల మీద షాకులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ పన్నెండో వారంలో దెయ్యాన్ని అడ్డుగా పెట్టి కంటెస్టెంట్లతో ఆటలు ఆడించాడు. అందరినీ భయపెట్టేందుకు బాగానే ప్రయత్నించాడు. ఇక ఈ ఆటలన్నీ ముగిసిపోయినట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ మరో పథకం వేశాడు.

బెస్ట్, వరెస్ట్ అంటూ..

బెస్ట్, వరెస్ట్ అంటూ..

ఫైనల్ రేసు మొదలైందని చెప్పిన బిగ్ బాస్ ఇప్పటి వరకు మాజీ కెప్టెన్‌లలో బెస్ట్ ఎవరు వరెస్ట్ కెప్టెన్ ఎవ్వరో చెప్పమని బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇక ఇందులో ఎవరికి వారు బెస్ట్ పర్పామెన్స్, బెస్ట్ కెప్టెన్ అని వాదించుకున్నారు. వారి పేర్లే చెప్పుకున్నారు.

అరియానాపై సోహెల్..

అరియానాపై సోహెల్..

అరియానా కెప్టెన్సీలో ఇళ్లంతా ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. సోహెల్‌ను ఎలా ముప్పుతిప్పలు పెట్టిందో మనమంతా చూశాం. అరియానా కెప్టెన్సీ తనకు నచ్చ లేదని టార్చర్ చూపించిందని సోహెల్ వరెస్టె క్యాటగిరీలో ఆమె పేరును చెప్పినట్టు కనిపిస్తోంది.

ఎవరిది వారే..

ఎవరిది వారే..

అయితే బెస్ట్ కెప్టెన్‌గా అరియానా, సోహెల్ తమ పేర్లు తామే చెప్పుకున్నారు. ఒక చేంజ్ అయితే తీసుకొచ్చాను.. ఎవరి స్వేచ్చను వారికి ఇచ్చాను అంటూ అరియానా తన గొప్పలు చెప్పుకుంది. సోహెల్ గాడు ఎవరి సాయం లేకుండా సొంతంగా ఆడి గెలిచి కెప్టెన్ అయ్యాడు.. పనిష్మెంట్లు స్టార్ట్ చేసింది సోహెల్ గాడంటూ తనది తాను గొప్పలు చెప్పుకున్నాడు సోహెల్.

Recommended Video

Actor Ananda Chakrapani Interview Part 3
ఇక ఈ చర్చల్లో అభిజిత్ అఖిల్ మధ్య మళ్లీ వార్

ఇక ఈ చర్చల్లో అభిజిత్ అఖిల్ మధ్య మళ్లీ వార్

మొదలైంది.నీ పార్ట్ నువ్ సెలెక్ట్ చేసుకోవడం అదృష్టమే అని అభిజిత్ అంటే.. దానికి ముందు చాలా కష్టపడ్డాను అని అఖిల్ అన్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోవడమే మామూలు విషయం కాదని అఖిల్ అన్నాడు. అది నీ దృష్టిలో అని అభిజిత్ కౌంటర్ వేశాడు. నా ప్రక్రియ అది నా మీద పడ్డది నువ్ వెళ్తే తెలిసేది అని అఖిల్ అంటే.. డేంజర్ జోన్ అని తెలిసే వెళ్లావ్ అంటూ అభిజిత్ అన్నాడు. ఇలా మాటా మాటా పెరుగుతోందని సోహెల్ మధ్యలోకి వస్తే ఆగురా నువ్ అంటూ అతడి మీదే అరిచాడు అఖిల్. మొత్తానికి నేడు ఈ ఇంట్లో అందరికీ ఓ షాక్ తగలబోతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X