Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవినాష్ మారిపోయాడు.. అతను ఊసరవెల్లి.. అరియానా కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్‌ది ఓ విచిత్ర జంట. ఇద్దరూ అతి చేయడంలో పోటీ పడుతుంంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఇద్దరికి జట్టు కుదిరిందని అంటుంటారు. కొన్ని విషయాల్లో నిజంగానే అతి అనిపించినా ఇంకొన్ని విషయాలో కరెక్టే అని అనిపిస్తుంటుంది. మొన్నటి టాస్క్‌లో అవినాష్‌కు అరియానా ఇచ్చిన సపోర్ట్, ధైర్యం, భరోసా అందరికీ ముచ్చటేశాయి. ఇద్దరూ కలిసి చేసిన ప్రచారం బాగానే ఆకట్టుకుంది.
నామినేషన్స్ నుంచి..
పన్నెండో వారంలో నామినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లంటూ నామినేటెడ్ కంటెస్టెంట్లకు ఆశలు పుట్టించి ఆట ఆడించాడు. మొదటి లెవెల్లో భాగంగా జెండాలు సేకరించాలన్నాడు. అందులో ఎవరు ఎక్కువ జెండాలు సేకరిస్తే వారు రెండో లెవెల్‌కు అర్హులని అన్నాడు.
ప్రచారం చేయాలి..
ఇక రెండో లెవెల్లో అవినాష్ అఖిల్ ప్రచారం చేసుకోవాలి.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందని తెలిపాడు. అలా ఆ ప్రచారంలో భాగంగా అవినాష్‌కు అరియానా సపోర్ట్ చేసిన విధానం, ఇచ్చిన మోరల్ సపోర్ట్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలని నెటిజన్లు అరియానాను ఆకాశానికెత్తేశారు.
ఎవిక్షన్ పాస్ రావడంతో..
అయితే అవినాష్ నామినేషన్స్‌లో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా ప్రవర్తిస్తాడు. ఎవిక్షన్ ప్రీ పాస్‌లు రావడం, ఎలిమినేషన్‌ను నుంచి గట్టెక్కే అవకాశం రావడంతో అవినాష్ మొహంలో కాంతి వచ్చింది. ఇక అవినాష్ చేష్టల్లోనూ మార్పులు వచ్చాయని అఖిల్ సోహెల్ అరియానా ఆట పట్టించారు.
Recommended Video
ఊసర వెల్లిలా..
మార్నింగ్ మస్తీ తరువాత అఖిల్ సోహెల్ వద్దకు వెళ్లి అవినాష్ డ్యాన్సులు చేశాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లు రావడంతో అవినాష్ మారిపోయాడని సోహెల్ అరియానాకు చెప్పాడు. అవును చాలా మారిపోయాడే ఊసరవెల్లి అంటే అవినాషే అని అరియానా కౌంటర్లు వేసింది. అయితే అవినాష్ మాత్రం వారికి ఎలాంటి సమాధానమివ్వకుండా సైలెంట్‌గానే ఉండిపోయాడు.