అవినాష్‌ను అలా ఇరికించేశారు.. నాగార్జునతో కలిసి ఆడేసుకున్న సుదీప్!!
బిగ్ బాస్ షోలో ఒక్కోసారి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. స్క్రిప్ట్ ప్రకారం ఒక్కోసారి బిగ్ బాస్ టీం ట్రాకులను ప్రోత్సహిస్తుంది. అవసరమైతే అవే ట్రాకులను విడగొడుతుంది. నిన్నటి ఎపిసోడ్‌తో నాగార్జున హోస్టింగ్‌పై కొందరు ఫైర్ అవుతూ ఉంటే.. ఇంకొందరు మాత్రం అదరగొట్టేశారని ప్రశంసించారు. ఒకరి కోసం ఆడకు నీ కోసం నువ్వే ఆడుకో అంటూ హారికకు మాత్రం క్లాస్ పీకిన నాగార్జున మిగతా వారిని వదిలేశాడు.
పైగా మిగతా ట్రాకులను బాగానే ఎంకరేజ్ చేస్తాడు. ఈ విషయం మరోసారి నాగార్జున నిరూపించుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కన్నడ స్టార్ సుదీప్, నాగార్జున కలిసి కంటెస్టెంట్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో మోనాల్ అఖిల్ ఇద్దరూ ఒక్కరేనని, ఇద్దరూ ఆలోచనలు.. ఇద్దరిలో ఎవ్వరినీ అడిగినా ఒకటే అని చెప్పాడు. ఇక అవినాష్ మళ్లీ ఎప్పటిలాగే ఇరికించే ప్రయత్నం చేశాడు.

కిల్ మ్యారీ డేట్ అంటూ ఇంట్లో ఉన్న ముగ్గురి అమ్మాయిల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావ్ అని సుదీప్ అడిగాడు. అంతకంటే ముందుగా అవినాష్ గురించి నాగార్జును సుదీప్‌కు చెబుతూ.. పులిహోర బాగా కలుపుతాడని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి, డేట్, చంపడం గురించి అడిగి అవినాష్‌ను మళ్లీ ఇరుకున పెట్టారు. కానీ అవినాష్ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. కానీ చివరకు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











