ఆ ఓట్ల సంఖ్య నిజమేనా?.. నాగార్జున మాటలపై అనుమానం
బిగ్ బాస్ షోకు హైప్ తీసుకొచ్చేందుకు, అది సూపర్ హిట్ అయిందని చెప్పేందుకు నాగార్జున ప్రతీ సారి ఏదో ఒక స్టోరీ చెబుతాడు. ఓట్లు అన్ని కోట్లు వచ్చాయి.. ఇన్ని కోట్లు వచ్చాయని చెబుతుంటాడు. మొదట్లో అయితే టీఆర్పీ రేటింగ్‌ల గురించి చెప్పేవాడు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తరు. ఎందుకంటే ఈ షోకు టీఆర్పీ లేక మొత్తానికి చతికిలపడిపోయింది. స్టార్ మాలో వచ్చే చిన్న సీరియల్లతో కూడా పోటీ పడలేకపోతోంది. అలాంటి ఈ షో మీద హైప్ పెంచేందుకు నిన్న నాగార్జున రెండు కథలు చెప్పాడు.
ఎప్పటిలాగే ఈ సారి కూడా ఓట్ల విషయాన్ని ప్రస్థావించాడు. ఈ వారంలోనూ ఓట్లు భారీగానే పడ్డాయట. 9.5 కోట్ల ఓట్లు పడ్డాయని నాగార్జున భీరాలు పలికాడు. అసలే ఈ వారం నామినేషన్‌లో ఉన్నది అఖిల్, అరియానా, అవినాష్, మోనాల్ వంటి కంటెస్టెంట్లు. వీరికే పడి పడి ఓట్లు వేసే అంత సీన్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత వారంలోనూ ఇదే నంబర్ చెప్పిన నాగార్జున.. ఈ వారం కూడా ఇదే నంబర్ చెప్పడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి.,

ఇక ఈ వారంలో అందరికీ కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయని టాక్. ఆ తరువాత మోనాల్,అరియానా, అవినాష్‌లకు వచ్చాయని సమాచారం. ఈ ఓట్ల సంగతి కాసేపు పక్కన పెడదాం. నిన్నటి షోలో గుంటూరులో జరిగిందని ఓ ఘటనగురించి చెప్పాడు. ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయాలని, ఆ వ్యక్తి కదలకుండా ఉండేందుకు బిగ్ బాస్ షో చూడాలని అడిగాడట. అది బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ అంటే ఏదో కాకమ్మ కథలు చెప్పాడని నెటిజన్లు బిగ్ బాస్ షోపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











