గేట్స్ ఓపెన్ చేయండంటూ సీరియస్... అభిజిత్‌ను గట్టిగా వేసుకున్న నాగార్జున
బిగ్ బాస్ షోలో నాగార్జున హోస్ట్‌గా ఇంత వరకు నిజంగా సీరియస్ అయిన ఘటనలు చాలా తక్కువ. ప్రోమోలో వీర లెవెల్‌లో చూపిస్తారు.. తీరా ఎపిసోడ్‌లోకి వస్తే మ్యాటర్ తుస్సుమనిపిస్తారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ నాగార్జున బాగానే సీరియస్ అయినట్టు కనిపించాడు. అభిజిత్ మీద బాగానే ఎక్కేశాడు. చివరకు బయటకు వెళ్లిపో అనేంతగా సీరియస్ అయ్యాడు. గేట్లు ఓపెన్ చేయండంటూ బిల్డప్ ఇచ్చాడు.

నాటి టాస్క్‌లో..
జలజ దెయ్యం బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఎలా ఆడుకుందో అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టాస్క్ ఇచ్చింది. అలా మోనాల్‌నుఏడిపించిన కారణంగా అభిజిత్ అఖిల్‌లు ఇద్దరిలో ఎవరో ఒకరు ఆమెను డేట్‌కు తీసుకెళ్లాలని టాస్క్ ఇచ్చింది. ఆ విషయంలో అభిజిత్ ఎమోషనల్ అయి.. ఏడ్చేసినంత పని చేశాడు. తాను మోనాల్‌తో డేట్‌కు వెళ్లను అని బిగ్ బాస్‌తో విన్నవించుకున్నాడు. టాస్క్ చేయకుండా వదిలేశాడు.

అదే విషయంలో..
అలా బిగ్ బాస్ ఇంట్లో టాస్క్ చేయకుండా ధిక్కరించడంపై నాగార్జున సీరియస్ అయ్యాడు. ఈ విషయంలో అభిజిత్, హారికలను నాగార్జున టార్గెట్ చేశాడు. అభిజిత్ టాస్క్ చేయకుండా ఉంటే నువ్ కెప్టెన్‌గా ఏం చేస్తున్నావ్.. చేయించాల్సిన బాధ్యత నీది కాదా? అని టార్గెట్ చేశాడు. దీంతో హారికకు ఏం చెప్పాలో పాలుపోలేదు.

అభిజిత్‌ను ఆడుకున్నాడు..
అభిజిత్ అఖిల్ మీ ఇద్దరూ మోనాల్‌ను బాగా ఏడిపించారు..అని అనగానే అని అభిజిత్ తన వాదనను వినిపించుకుంటూ ఉన్నాడు. మధ్యలో నాగార్జున అందుకుని.. ఆ మాటలో ఏదైనా తప్పు ఉందా? అభిజిత్ అని రివర్స్ అయ్యాడు. నేను అయితే ఏడిపించలేదు అని అభిజిత్ అన్నాడు. అలా అనడంతో అభిజిత్ మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించాడు నాగార్జున.

సారీ చెప్తావ్..
నువ్ చెప్పిన మాటలే బిగ్ బాస్ కూడా టాస్క్‌లో పంపించాడు అని నాగార్జున చెప్పాడు. ఆ విషయం నేను ఒప్పుకుంటాను సారీ సర్.. అంటూ అభిజిత్ చెప్పుకొచ్చాడు. ఇదేమీ మొదటి సారీ కాదు నువ్ తప్పు చేస్తావ్.. మళ్లీ క్షమించమని అడుగుతావ్.. చేస్తావ్.. అడుగుతావ్ అంటూ అభిజిత్‌ను నిలబెట్టి మరీ పరువుదీశాడు.
Recommended Video
గేట్స్ ఓపెన్
నువ్ టాస్క్ చేయలేదు.. అది బిగ్ బాస్ రూల్ ప్రకారం తప్పు.. ప్లీజ్ ఓపెన్ గేట్స్ అంటూ అభిజిత్‌ను భయపెట్టే ప్రయత్నం చేశాడు నాగార్జున. అయితే ప్రోమోల బాగానే ఇంపాక్ట్ చూపించారు. కానీ పూర్తి ఎపిసోడ్‌లో ఎంత ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











