హారిక-అభిజిత్ ఫేవరెటిజం.. అఖిల్-మోనాల్‌ది అలానా?.. దొరికేసిన నాగార్జున

బిగ్ బాస్ షోలో పన్నెండో వారంలో శనివారం నాటి ఎపిసోడ్ మంచి ఫైర్ మీద నడిచింది. హోస్ట్‌గా నాగార్జున ఇంత వరకు అడగని, చేయనవన్నీ చేశాడు. అయితే అంత వరకు బాగానే ఉంది. కానీ ఓ ఇద్దరి కంటెస్టెంట్ల విషయంలోనే అలాంటివి చేసిన మిగతా వాళ్లందరినీ వదిలేయడంతో అసలు సమస్య వచ్చింది. లింకులు కలిపేది బిగ్ బాసే. ట్రాకులు వేసేది నాగార్జునే. అక్కడ ఏమీ లేకపోయినా సరే క్రియేట్ చేసేది నాగార్జునే. అలాంటి హోస్ట్ నాగార్జున మళ్లీ నువ్ ఒకరి కోసం ఆడుతున్నావ్. ఫేవరెటిజం అనడంతో అందరూ భగ్గుమన్నారు.

 హారికపై చిందులు..

హారికపై చిందులు..

శనివారం నాటి ఎపిసోడ్‌లో హారికను కన్ఫెషన్ రూంలోకి పిలిచిన తరువాత నాగార్జున చిందులు తొక్కాడు. వీడియోల మీద వీడియోలు ప్లే చేసి హారిక గుట్టంతా బయటపెట్టాడు. హారిక అభిజిత్ కోసం ఆడుతుందని, అభిజిత్‌పై ఫెవరెటిజం చూపిస్తోందని అరిచేశాడు. నీ ఆట నువ్ ఆడుకో అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు.

 మిగతా వారు మాత్రం..

మిగతా వారు మాత్రం..

అయితే ఇక్కడ కేవలం హారిక మాత్రమే అభిజిత్ కోసం ఆడుతుందా? ఆ ఇద్దరే మీకు కనిపించారా? అంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. అఖిల్ మోనాల్ వ్యవహారం, అరియానా అవినాష్, సోహెల్ మెహబూబ్ ఇలా అందరూ ఒకరి కోసం ఆడలేదా? అది ఫెవరిటిజం కాదా? అని కౌంటర్లు వేస్తున్నారు.

మోనాల్ ఒప్పుకున్నా కూడా..

మోనాల్ ఒప్పుకున్నా కూడా..

మోనాల్ సేవ్ అయ్యాక ఒక మాట అంది.. ఈ వీక్ నాకు చాలా ఇంపార్టెంట్.. ఫస్ట్ టైం నాకోసం నేను ఆడాను.. నా కోసం నేను మాట్లాడాను అని చెప్పుకుంది. అయితే ఇంత వరకు ఆడలేదనేది దాని అర్థం. మరి హారికకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున మోనాల్‌కు మాత్రం ఇవ్వలేదని నెటిజన్లు మండిపడ్డుతున్నారు. బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని నెటిజన్లు నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున అడ్డంగా దొరికిపోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నేడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ స్పెషల్ హోస్ట్‌గా వచ్చాడు. సుదీప్, నాగార్జున కలిసి హోస్ట్ చేశారు. ఇందులో భాగంగా సుదీప్.. అఖిల్ పేరు చెప్పాడు.. సారీ అంటూ మళ్లీ మోనాల్ పేరు చెప్పాడు. ఆ ఇద్దరిలో ఎవరిని అడిగినా ఒకటే... ఆ ఇద్దరూ ఒక్కటే అని నాగార్జున అన్నాడు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
మళ్లీ ట్రోలింగ్..

మళ్లీ ట్రోలింగ్..

అలా మోనాల్ అఖిల్ ఇద్దరూ ఒక్కటే అని అందరి ముందే అన్న నాగార్జున.. అలా ఎందుకు ఆడుతున్నారు.. ఎవరి ఆట వారు ఆడండి అని ఎందుకు అనలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హారిక అభిజిత్ పట్ల ఫెవరెటిజం చూపిస్తోందని, తన ఆట తనను ఆడమని చెప్పినప్పుడు.. మోనాల్, అఖిల్‌లకు కూడా అదే చెప్పాలి కదా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X