అందుకే అభిజిత్ గ్రేట్.. ఏది చేసినా ఆలోచించే చేస్తాడు.. అందరూ ఫాలో అవ్వాల్సిందే!

బిగ్ బాస్ షోలో పదమూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో రచ్చ రచ్చ జరిగింది. ఎన్నడూ లేని విధంగా మోనాల్ విరుచుకుపడింది. అవినాష్ తాట తీసింది. అరియానా యాటిట్యూడ్‌కు కౌంటర్ వేసింది. అఖిల్ అభిజిత్‌లను మోనాల్ నామినేట్ చేసింది. ఇలా చాలానే విషయాలు జరిగాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ కాస్త వెరైటీగా నామినేషన్స్ ప్రక్రియను ఇచ్చాడు. రంగులున్న సీసాలను కంటెస్టెంట్లకు ఇచ్చి నామినేట్ చేయదల్చుకున్న ఇంటి సభ్యుల ముందున్న బీకరులో పోయాలని తెలిపాడు. అందులో ఉన్న మర్మాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. కానీ అభిజిత్ అర్థం చేసుకున్నాడు.

నామినేషన్స్ అలా..

నామినేషన్స్ అలా..

పదమూడో వారంలో నామినేషన్ ప్రక్రియ రంగు నీళ్ల పరిమాణంతో డిసైడ్ చేశాడు. ప్రతీ కంటెస్టెంట్‌కు ఓ బీకరను కేటాయించాడు. అందులో ఎవరికి రంగు నీళ్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుందో వారు నామినేట్ అవుతాడని చెప్పాడు. నామినేట్ చేయదల్చుకున్న వారి బీకరులో ఒక్కో కంటెస్టెంట్ వారి దగ్గరున్న రంగు నీళ్లను పోయాల్సి ఉంటుందని తెలిపాడు.

లాజిక్ అర్థం చేసుకోలేదు..

లాజిక్ అర్థం చేసుకోలేదు..

అయితే అక్కడ ఇంటి సభ్యులు సరిగ్గా లాజిక్ అర్థం చేసుకోలేకపోయారు. రంగు నీళ్లు పోయమని చెప్పాడు కానీ ఎంత క్వాంటిటీలో పోయమని నిర్దిష్టంగా చెప్పలేదు. అందుకే నామినేషన్ చేసేందుకు మొదటగా వచ్చిన హారిక తాను నామినేట్ చేయదల్చుకున్న వారి బీకరులో సరి సమానంగా పోసింది. అభిజిత్ బీకరులో హారిక సగం రంగు నీళ్లను పోసింది.

లాజిక్ పట్టేసిన అభిజిత్..

లాజిక్ పట్టేసిన అభిజిత్..

అయితే అభిజిత్ ఎంతలా ఆలోచిస్తాడు.. అందులో ఎలాంటి లొసుగులను ఉపయోగించవచ్చో.. ఎలా తప్పించుకోవచ్చు.. ఎదుటి వారిని ఎలా ఇరికించ వచ్చో అన్నీ ఆలోచిస్తాడు.. గమనిస్తాడు.. ఆచరణలో పెడతాడు. అందుకే నిన్నటి నామినేషన్ ప్రక్రియలో తన దగ్గరున్న రంగు నీళ్లతో దాదాపు మొత్తం క్వాంటిటీని మోనాల్ బీకరులో పోశాడు. మోనాల్‌ను అలా నామినేట్ చేశాడు. ఇక రెండో పేరులో హారికను ఎంచుకుని అందులో కొంచెం మాత్రమే పోసీ పోయనట్టు పోశాడు. ఇద్దరి బీకరులో పోయమన్నాడు.. పోశాను అంటూ అదిరిపోయే లాజిక్ తీశాడు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
అందరూ ఫాలో అయ్యారు..

అందరూ ఫాలో అయ్యారు..

అయితే అభిజిత్ చెప్పిన.. ఇచ్చిన.. ఆచరించిన లాజిక్‌ను తరువాత అందరూ ఫాలో అయ్యారు. అరియానా, అఖిల్, సోహెల్, మోనాల్ అందరూ కూడా తమ తమ రంగు నీళ్లను ఎవరికి ఎక్కువ పోయాలి.. ఎవరికి తక్కువ పోయాలన్నది చూసుకుని నింపారు. అలా అభిజిత్ అన్నింటిలోనూ తన మైండ్‌ను పెట్టి ఆడతాడు.. అభి గ్రేట్ అని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X