ఎలిమినేట్ చేసి పారదొబ్బండి.. అందరూ ఒక్కటయ్యారు.. ఆగ్రహంతో ఊగిపోయిన అవినాష్
బిగ్ బాస్ షోలో పదమూడో వారం రేస్ టు ఫినాలే టాస్క్‌ను ఇచ్చాడు. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియను కానిచ్చేశారు. అందులో భాగంగా సోహెల్ అరియానా తప్పా మిగిలిన ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు. ఇక ఫినాలే వీక్‌కు మధ్యలో ఒకే వారం గ్యాప్ ఉండటంతో ఆటలో వేగాన్ని పెంచాడు. అందుకు ఫినాలే టిక్కెట్ టాస్కును ప్రారంభించేశాడు. ఈ ఫినాలే టాస్కులో ఎవరు బాగా ఆడతారు.. ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఫినాలే టిక్కెట్..
బిగ్ బాస్ షోలో ఫినాలే టిక్కెట్ గెలుచుకోవడమన్నది ఎంతో ముఖ్యం. ఒక్కసారి ఆ టిక్కెట్ చేతిలో పడిందంటే... ఇక టాప్ 5లో చోటు దక్కించుకున్నట్టే. ఓ రెండు వారాలు నామినేషన్స్, ఎలిమినేషన్స్ భయం లేకుండా హ్యాపీగా గడిపేయొచ్చు. గత సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ ఈ ఫినాలే టిక్కెట్టును సొంతం చేసుకున్నాడు.

నాల్గో సీజన్‌లో..
ప్రస్తుతం జరుగుతున్న నాల్గో సీజన్‌లో రేస్ టు ఫినాలే టాస్క్ మొదలైంది. ఈ టిక్కెట్ టు ఫినాలేను ఎవరు గెలుచుకుంటారో చూడాలి. టిక్కెట్టును పొందాలంటే పాలు ఎక్కువగా సేకరించాలని బిగ్ బాస్ తెలిపాడు. గార్డెన్ ఏరియాలో పెట్టిన బర్రె (బొమ్మ)కు పాలు పితకాలిని చెప్పాడు. అది అంబా అని అరిచినప్పుడల్లా క్యాన్స్‌లో పట్టుకుని సీసాల్లో పాలు సేకరించి భద్రపరుచుకోవాలని తెలిపాడు.

అందరూ తన్నుకుంటున్నారు..
అయితే ఈ టాస్క్‌లో అందరూ విరుచుకుపడుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ఎవ్వరూ తగ్గడం లేదు. చూస్తుంటే ఎవరి గేమ్ వారే ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఒకరినొకరు తోసుకుంటూ పాలు పట్టేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ మాత్రం కంట్రోల్ తప్పినట్టు కనిపిస్తున్నాడు.
Recommended Video

ఊగిపోయాడు..
నామినేషన్స్ టాస్క్ వచ్చినప్పుడు అవినాష్ కాస్త కంట్రోల్ తప్పుతుంటాడు. ఈ సారి కూడా అవినాష్ అలాగే ప్రవర్తించినట్టున్నాడు. అందరూ కలిసి ఆడుతున్నారు.. లిటరల్‌గా ఒక్కటయ్యారు.. మీరే ఆడుకోండి.. నన్ను ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ సోహెల్, అఖిల్ మీద అవినాష్ ఫైర్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











