Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఇలా అయితే మహిళలెవ్వరూ టైటిల్ గెలవలేరు.. రేస్ టు ఫినాలే టాస్క్‌పై హారిక కామెంట్స్
బిగ్ బాస్ షోలో రేస్ టు ఫినాలే టాస్క్ ఫుల్ జోష్‌లో సాగుతోంది. మొదటి లెవెల్లో భాగంగా బిగ్ బాస్ ఇళ్లు పాల కేంద్రంగా మారిపోయింది. పాలు పట్టుకునేందుకు ఇంటి సభ్యులందరూ గొడవలు పెట్టుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అందులో కొందరు అలిగి టాస్కును వదిలేశారు. ఇంకొందరు తమ శక్తి మేరకు పోరాడి ఓడిపోయారు. మొత్తానికి మొదటి లెవెల్ పూర్తయ్యే సరికి నలుగురు మాత్రమే విజేతలయ్యారు.
ముగ్గురు అవుట్..
పాలను సేకరించడంలో అవినాష్ అరియానా మోనాల్ వెనుకబడ్డారు. అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ అవినాష్ టాస్క్‌ను మధ్యలోనే ఆపేశాడు. నీళ్లు, కిచెన్లొని పాల ప్యాకెట్లతో నింపి అడ్డదారిలో పాల సీసాల సంఖ్యను పెంచుకున్నాడు. అవి చెల్లవని చెప్పి అవినాష్‌ను పక్కకు తప్పించాడు బిగ్ బాస్. ఇక అరియానా, మోనాల్ తక్కువ పాల సీసాలను నింపడంతో అవుట్ అయ్యారు.
ఆ నలుగురు..
మొదటి లెవెల్‌ను అభిజిత్ హారిక అఖిల్ సోహెల్‌లు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ నలుగురు రెండో లెవెల్‌కు అర్హత సాధించారని బిగ్ బాస్ తెలిపాడు. ఇక ఈ నలుగురికి రెండో లెవెల్ అదిరిపోయే టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. పై నుంచి వచ్చే పూలను.. తొట్టిలో పాతాలని తెలిపినట్టున్నాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో పూల కోసం మళ్లీ గొడవలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
హారికను చెయ్యి పట్టి..
రెండో లెవెల్లో హారిక ఒక్కతే అమ్మాయి.. మిగతా అందరూ అబ్బాయిలే. అయితే ఆ పూలను సేకరించడంలో హారికను సోహెల్ కట్టడి చేసినట్టు కనిపిస్తోంది. హారిక చేతిని పట్టుకుని పూలను సేకరించకుండా అడ్డుపడటంతో హారిక హర్టైనట్టుంది. ఫిజికల్ టాస్కుల్లో ఆ ముగ్గురితో పోటీ పడి ఆడటం చాలా కష్టంగా మారింది.
Recommended Video
కావాలని చేశాడా?
తొట్టిలో నాటిన పూలను తీసుకోనివ్వడం లేదు.. పై నుంచి పడుతున్న పూలను ఏరుకోనివ్వడం లేదు.. చేతుల్లోంచి తీసుకోవద్దంటున్నారు.. ఇలా అయితే లేడీ టైటిల్ గెలిచినట్టే అంటూ ఆవేదన చెందింది. మరి సోహెల్ కావాలని హారికను అడ్డుకుంటున్నాడా? అఖిల్‌తో కలిసి గేమ్ ఆడుతున్నాడా? అన్నది పూర్తి ఎపిసోడ్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటి వరకు లీకైన సమాచారం మేరకు రేస్ టు ఫినాలే టాస్క్‌లో అఖిల్ గెలిచి టాప్ 5 బెర్తును కన్ఫామ్ చేసుకున్నాడని తెలుస్తోంది.