పులిహోర రాజా.. అందులోనూ అఖిలే నెంబర్ వన్.. పరువుదీసిన హారిక

బిగ్ బాస్ షోలో పులిహోర రాజాలే ఎక్కువ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ నాల్గో సీజన్‌లో అలాంటి వాళ్లు ఎక్కువయ్యారు. స్క్రీన్ స్పేస్ కోసమో, లేదా అక్కడ టైం పాస్ కోసమో లేదా నిజంగానే ఇష్టపడి ట్రాకులు నడిపిస్తారా? అన్నది తెలియదు. రెండో సీజన్‌లో తనీష్ మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ ట్రాకులు నడిపించి బాగానే సక్సెస్ అయ్యారు. ఇక నాల్గో సీజన్‌లో అయితే పులిహోర రాజాలు చాలా మందే ఉన్నారు.

అవినాష్ టాప్ ప్లేస్..

అవినాష్ టాప్ ప్లేస్..

నాల్గో సీజన్‌లో పులిహోర రాజాల్లో అందరి కంటే ముందు స్థానంలో అవినాష్ ఉంటాడు. వైల్డ్ కార్డ్‌గా ఇంట్లోకి వచ్చిన క్షణం నుంచి పులిహోర కలపడం ప్రారంభించాడు. వచ్చీ రావడంతోనే మోనాల్‌కు లైన్ వేశాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న అందరితో ట్రాకులు నడిపించేందుకు ప్రయత్నించాడు.

అభిజిత్ సైలెంట్‌గా..

అభిజిత్ సైలెంట్‌గా..

బిగ్ బాస్ ఇంట్లో అభిజిత్ వేసే ట్రాకులు, కలిపే పులిహోర ఎవ్వరికీ కనపడకుండా ఉంటుంది. అవినాష్ చేసే ఫ్లర్టింగ్ అందరికీ కనపడేలా ఉంటుంది. అలా అభిజిత్ మొదటగా మోనాల్ ఆ తరువాత స్వాతి దీక్షిత్.. మళ్లీ దివి.. ఇలా అందరితోనూ క్లోజ్‌గానే మూవ్ అవుతూ వచ్చాడు. పులిహోర రాజాగా అభిజిత్‌ను నెటిజన్లు అభివర్ణిస్తుంటారు.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
రెచ్చిపోతోన్న అఖిల్..

రెచ్చిపోతోన్న అఖిల్..

అఖిల్ మొదటగా మోనాల్‌తోనే క్లోజ్‌గా ఉండేవాడు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అఖిల్ హారిక అరియానాలతో బాగానే దగ్గరవుతున్నాడు. అరియానాతో అయితే అఖిల్ మరీ దగ్గరవుతున్నాడు. అవినాష్‌ను ఉడికించేందుకు అరియానాతో మరింత క్లోజ్‌గా మూవ్ అవుతుంటాడు. ఈ మధ్య అరియానా కూడా హగ్గులు ఇస్తూ బాగానే ఎంకరేజ్ చేస్తోంది. అరియానా అఖిల్ ట్రాక్ మీద ఇంట్లో అందరూ కామెంట్ చేస్తున్నారు.

 పరువుదీసిన హారిక..

పరువుదీసిన హారిక..

అరియానా అఖిల్ ట్రాక్ మీద హారిక మోనాల్‌లు బాగానే ముచ్చటిస్తున్నారు. ఇదే విషయాన్ని నాగార్జున ముందు కూడా పెట్టారు. పులిహోర బాగా కలుపుతున్నాడు.. ఇంట్లో బాగానే చేస్తున్నాడని హారిక అనడం.. ఈ మధ్య హగ్గులు కూడా బాగానే వస్తున్నాయని నాగార్జున ఉప్పు అందించడం.. పులిహోర కలపడంతో అఖిలే నెంబర్ వన్ అంటూ హారిక తిరిగి సెటైర్ వేయడంతో అందరూ నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X