పిలిచి మరీ పరువుపోగొట్టుకున్నాడు.. అవినాష్‌ను అన్నా అనేసిన మోనాల్

బిగ్ బాస్ షోలో మోనాల్ వ్యవహారం ఎన్నడూ కూడా ఓ పట్టాన తేలదు. అఖిల్‌తో వద్దు ఇకపై నా గేమ్ నేనే ఆడుకుంటాను.. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను.. నా ఫ్యామిలీ కోసం నేను ఆడుతాను అంటూ తనలో తానే చెప్పుకుంటుంది. మళ్లీ మరు క్షణమే అఖిల్ పంచన చేరుతుంది. సింగిల్‌గానే ఆడుకుంటాను అంటుంది... మళ్లీ అఖిల్ దగ్గరికే వెళ్తుంది. మోనాల్ వల్ల తన గేమ్ చెడిపోతోందని చెప్పినా కూడా మళ్లీ వెళ్లి అఖిల్ దగ్గరే కూర్చుంటుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్ రెండో లెవెల్ గెలిచాక మోనాల్ బాగానే బూస్టప్ ఇచ్చింది. ఇద్దరూ స్మిమ్మింగ్ పూల్ వద్ద కూర్చుని ముచ్చట్లు పెట్టింది. చీతా, లయన్ వీటిలో ఏది ఫాస్ట్‌గా పరిగెత్తుతుందని అఖిల్‌ను మోనాల్ అడగడంతో.. దానికి చిరుత అని సమాధానం చెప్పాడు. అది నువ్వేఅంటూ కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ఈ రాత్రి నువ్ బాగా పడుకో.. మూడో లెవెల్ టాస్క్ బాగా ఆడాలి అని చెప్పింది. మా ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక మూడో లెవెల్ టాస్క్‌లో భాగంగా ఊయల మీద ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటే వారే విజేత అని తెలిపాడు బిగ్ బాస్.

Bigg Boss 4 telugu week 13 Monal Calls Avinash As Brother

అయితే అవినాష్‌ మోనాల్‌ మీద చేతులేసుకుని తీసుకొచ్చాడు. అది అఖిల్ కంట పడాలని కాస్త ఎక్కువ చేశాడు. అతను మీ తమ్ముడా అని అవినాష్‌ను చూసుకుంటూ మోనాల్‌తో అఖిల్ కౌంటర్ వేశాడు. దాంతో అవినాష్ మోనాల్‌తో చర్చించాడు. నేను నీకు అన్ననా? అవినాషా? అని మోనాల్‌ను అడిగేశాడు. అవినాష్ అన్న అంటూ మోనాల్ గాలి తీసేసింది. పిలిచి మరీ పరువుతీసుకోవడమంటే ఇదే అని అవినాష్ నోర్మూసుకున్నాడు. నిన్న రాత్రి మోనాల్ ముద్దు పెట్టడంతో అవినాష్ ఏదైనా ఫీలై ఉంటాడు. కానీ ఇలా అన్న అనేసరికి బాగానే హర్ట్ అయినట్టున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X