కాలితో తన్నిందా?.. అవినాష్ మోనాల్ పంచాయితీ.. నాగార్జున తీర్పు ఏంటంటే?
బిగ్ బాస్ షోలో గొడవలు అనేది కామన్. కంటెస్టెంట్ల మధ్య గొడవలు కానీ రోజంటూ ఉండదు. ఇంట్లో జరిగే గొడవలనే బిగ్ బాస్ టీం చూపిస్తుంది. వాటినే ఎంకరేజ్ చేస్తుంది. అందుకే మొన్నటి రేస్ టు ఫినాలే టాస్క్‌లో అవినాష్ మోనాల్ ఇష్యూను అంత బాగా హైలెట్ చేసింది. ఎపిసోడ్ అంతా కూడా అదే విషయంపై చర్చలు పెట్టుకున్నారు. వాటినే ప్రసారం చేశారు. కాలితో కావాలని తన్నిందని అవినాష్ చెప్పడం.. మోనాల్ మాటలు మార్చడం వంటివి చేస్తూ వచ్చింది.
Recommended Video

మొదటి లెవెల్ టాస్క్‌లో..
రేస్ టు ఫినాలే టాస్క్‌లో మొదటి లెవెల్‌లో పాలు పట్టే పనిని అప్పగించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు (బొమ్మ) నుంచి సమయానుసారంగా వచ్చే పాలను సేకరించాలి. వాటిని సీసాల్లో నింపాలి. తక్కువ సీసాల్లో పాలు నింపిన వారు ఆట నుంచి తప్పుకోవాలని తెలిపాడు. ఇక పాలు పట్టుకునే సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి.

అవినాష్ మోనాల్ మధ్య..
పాలు పట్టుకునే క్రమంలో అవినాష్ మోనాల్ మధ్య గొడవ జరిగింది. మోనాల్ తన కాలితో తన్నిందని, అది కూడా కావాలనే తన్నింది.. వెరైటీగా ఓ చూపు కూడా చూసి నవ్విందని అవినాష్ మొదటి నుంచి ఆరోపిస్తు వచ్చాడు. అక్కడే ఆ విషయాన్ని నిలదీశాడు. ఆ సమయంలో మోనాల్ కూడా ఒప్పుకుంది. నువ్ అరియానాను నెడుతున్నావ్ అందుకే తన్నానని మోనాల్ విరుచుకుపడింది.

మాటలు మార్చిన మోనాల్..
మొదటగా అవినాష్‌ను తన్నాను అని మోనాల్ ఒప్పుకుంది. అరియానాను నెట్టేస్తున్నావ్ అందుకే తన్నాను అని చెప్పుకొచ్చింది. సోహెల్ అడిగితే.. తన్న లేదని చెప్పింది. ఆ తరువాత అందరూ అడుగుతూ ఉంటే.. నాక్కూడా డౌట్ వస్తుంది.. కావాలని తన్న లేదంటూ మోనాల్ మాట మార్చేసింది. కావాలని తన్నలేదు.. క్షమించు అంటూ అవినాష్ కాళ్లు పట్టేందుకు మోనాల్ సిద్దమైంది.

వీకెండ్‌లో వీడియో..
ఎవరిది తప్పో నాగార్జున గారిని వీకెండ్‌లో వీడియో ప్లే చేసి చూపించమని అడుగుతాను అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. సరే నాక్కూడా ఏ ప్రాబ్లం లేదంటూ మోనాల్ కూడా సై అంది. అయితే నేడు మోనాల్ అవినాష్ ఇద్దరినీ కూడా నాగార్జున ఉతికి ఆరేశాడని కనిపిస్తోంది. మోనాల్ ఏడ్పులకు కరిగిన నాగ్.. ఆ కోపాన్ని అవినాష్ మీద తీర్చుకున్నట్టు కనిపిస్తోంది.

కన్ఫెషన్ రూంలో..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అవినాష్, మోనాల్‌ను ఇద్దరినీ కూడా కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు నాగ్. ఎన్ని సార్లు చెప్పాలి అంటూ మోనాల్ మళ్లీ తన ట్యాప్‌ను విప్పింది. ఇక అవినాష్ అయితే ఏ మాత్రం తగ్గకుండా మోనాల్ చేష్టలను ఎక్స్ ప్రెషన్స్‌తో సహా బయట పెట్టేశాడు. దీంతో నాగ్ వీడియోను బయట పెట్టి ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని తేల్చనున్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











