మోనాల్‌కు అవినాష్ బిస్కెట్ .. పుష్పం అంటూ దారుణంగా పరువుదీసిన నాగార్జున

బిగ్ బాస్ షోలో అవినాష్ మీద వేసే జోకులు.. అవినాష్ వేసే జోకుల గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హోస్ట్‌గా వచ్చే నాగార్జున మాత్రం అవినాష్‌పై స్పెషల్ టార్గెట్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ ఏదో మ్యాటర్‌లో ఇరికిద్దామని, ఏదో ట్రాకు అంటగడదామని, సెటైర్లు వేసేద్దామని ట్రై చేస్తుంటారు. దానికి తగ్గట్టే అవినాష్ కూడా కొన్ని పనులు చేస్తాడు. వీకెండ్‌లో అవినాష్ కాసింత ఫుల్ జోషల్‌లోనే కనిపిస్తాడు.

మూడ్స్ మారుతుంటాయి..

మూడ్స్ మారుతుంటాయి..

అవినాష్ మూడ్స్ క్షణాల్లో మారుతుంటాయి. ఇంట్లోకి వచ్చిన కొత్తలో అంతా నవ్వుతూ నవ్విస్తూనే కనిపించాడు. కానీ రాను రాను అవినాష్ అసలు కథ బయటకు వచ్చింది. చిన్న విషయాలకు గొడవలు పడటం, ఇతరుల మీద అరవడం, కొన్ని సార్లు లాజిక్ లేకుండా వాదనలు వినిపించడం వంటివి చేస్తుంటాడు. అయితే వీకెండ్‌లో నాగార్జున ముందు ఫుల్ హుషారుగా ఉంటాడు.

వీకెండ్ స్పెషల్..

వీకెండ్ స్పెషల్..

ఎలిమినేషన్ అంటే భయపడే అవినాష్.. వీకెండ్స్‌లో కాస్త సందడిగానే కనిపిస్తుంటాడు. అయితే రాను రాను అవినాష్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. కానీ గత వారంలో వచ్చిన షాక్‌తో అవినాష్ దెబ్బకు నేల మీదకు దిగాడు. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో అవినాష్ మంచి ఊపు మీదున్నట్టు కనిపిస్తున్నాడు.

ఆడుకున్నాడు..

ఆడుకున్నాడు..

అయితే ఆరిపోయే దీపానికే వెలుగు ఎక్కువ అన్నట్టు.. ఎలాగూ ఎలిమినేట్ అవుతున్నాడు కదా అని బిగ్ బాస్ టీం ఈ రోజు అవినాష్‌ను బాగానే వాడుకున్నట్టు కనిపిస్తోంది. పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తున్నాడు నాగార్జున. తన ముందే మోనాల్‌తో పులిహోర కలుపుతున్న అవినాష్‌కు నాగార్జున అదిరిపోయే పంచ్ ఇచ్చాడు.

ఓ ఫ్లవర్‌కే ఇచ్చింది..

ఓ ఫ్లవర్‌కే ఇచ్చింది..


సండే ఫండే టాస్క్‌లో భాగంగా మోనాల్ అవినాష్‌కు ఓ ఫ్లవర్ ఇచ్చింది. దానికి తెగ సంబరపడిపోయిన అవినాష్ ఓ డైలాగ్ వేశాడు. ఫస్ట్ టైం సార్.. ఓ ఫ్లవర్.. ఇంకో ఫ్లవర్ ఇచ్చింది అని చెప్పాడు. అవును.. ఓ ఫ్లవర్‌కే ఇచ్చింది అంటూ అవినాష్‌ను పుష్పమని పరోక్షంగా అనేశాడు.

హారిక వింత అలవాటు..

హారికకు ఉన్న వింత అలవాటు గురించి నాగార్జున రాయమని చెప్పాడు. అది అస్సలు ఎవ్వరూ గెస్ చేయలేరంటూ హారిక అనడం.. అడిషనల్ కావాలేమో అని అభిజిత్ కౌంటర్ వేయడం బాగానే క్లిక్ అయింది. ఇక అవినాష్ రాసిన స్పెల్లింగ్ తప్పుగా ఉండటంతో నాగార్జున ఏడిపించేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X