మేమంతా ఉండి లాభమేంటి?.. అరియానా అరుపులు వృథా అయ్యేలా ఉంది!!
బిగ్ బాస్ షోలో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ రచ్చ రచ్చగా మారేలా ఉంది. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలు బాగానే వైరల్ అవుతున్నాయి. అవినాష్ ఫ్రస్ట్రేషన్, అరియానా అసహనం, గ్రూపులుగా మారి ఆటలు ఆడటంపై ఇంట్లో గొడవలు జరిగేలా ఉన్నాయి. అయితే ఎవరు ఎంతగా వాదించుకున్నా గొడవలు పడినా బయటకు లీకులు వచ్చేశాయ్. టిక్కెట్ టు ఫినాలే టాస్క్ మొదటి లెవెల్‌లో ఎవరు విన్ అవుతారో అందరికీ తెలిసిపోయింది.

ఫినాలే టిక్కెట్..
బిగ్ బాస్ షోలో ఫినాలే టిక్కెట్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఈ టిక్కెట్ టు ఫినాలే గెలుచుకుంటే నేరుగా టాప్ 5లోకి వెళ్లే అవకాశం వస్తుంది. అంటే ఇక ఎలిమినేషన్లు, నామినేషన్లు అనే గోల ఉండదు. అందుకే కంటెస్టెంట్లందరూ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.

పాలు సేకరించడం..
ఇక ఈ నాల్గో సీజన్‌లో ఫినాలె టిక్కెట్టును పొందేందుకు ఓ టాస్క్ పెట్టాడు. గార్డెన్ ఏరియాలో బర్రె బొమ్మను పెట్టాడు. అది అంబా అని అరిచిన ప్రతీసారి కంటెస్టెంట్లందరూ పాలను పట్టుకోవాలని.. సీసాల్లో నింపుకుని భద్రపరుచుకోవాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్లు పాలు పట్టేందుకు పోటీ పడ్డారు.

అవినాష్ ఆగ్రహం..
అందరూ కలిసి ఆడుతున్నారు.. లిటరల్‌గా ఒక్కటయ్యారు.. మీరే ఆడుకోండి.. నన్ను ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ సోహెల్, అఖిల్ మీద అవినాష్ ఫైర్ అయ్యాడు. అవినాష్ పాల క్యాన్‌ను సోహెల్ పారేయడంతో బాగానే హర్ట్ అయినట్టున్నాడు.

అరియానా అసహనం..
అయితే బర్రె అంబా అని అరిచిన ప్రతీసారి ఇంటి సభ్యులు పాలు పట్టేందుకు పరిగెత్తుతున్నారు. కానీ ఇందులో సోహెల్, అఖిల్ మాత్రమే ముందుంటున్నారు. అందులో అరియానాకు చాన్స్ దొరకడం లేదు. అరియానాను ఎవ్వరూ కూడా పట్టుకోనివ్వడం లేదు. మొత్తం మీరే పట్టుకుంటే.. ఇక్కడ మేమంతా ఉండి లాభమేంటని అరియానా అసహనం వ్యక్తం చేసింది.
Recommended Video

టాస్క్ అంటేనే అలా..
అయితే టాస్క్ అంటేనే అలా ఉంటుందని.. ఏ ఒక్కరూ ఇంకొకరి కోసం తమ వంతు పాలను వదులుకోరు. ఆ విషయం అరియానాకు అర్థం కావడం లేదేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అఖిల్ సోహెల్ కలిసి ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ టాస్క ఫస్ట్ లెవెల్‌లో అరియానా, అవినాష్, మోనాల్ అవుట్ అవుతారని తెలుస్తోంది. అరియానాను అసలు పాలు పట్టే చాన్స్ కూడా ఇవ్వడం లేనట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











