Bigg Boss 4 Leaks.. టాస్క్‌లో అభిజిత్‌కు గాయాలు.. అభిమానులకు షాక్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లోని కంటెస్టెంట్లను ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అమ్మ రాజశేఖర్, గంగవ్వ, నోయల్, అభిజిత్ ఇలా కంటెస్టెంట్లందరూ అనారోగ్యం కారణంగా సతమవుతూనే ఉన్నారు. అయితే అమ్మ రాజశేఖర్ ఏనాడూ కూడా తన సమస్యలను బయటకు చెప్పుకోలేదు. అభిజిత్ కూడా ఏనాడూ చెప్పుకోలేదు గానీ.. ఫిజికల్ టాస్కుల్లో అంతగా పర్ఫామ్ చేయలేదు. ఇక నోయల్, గంగవ్వలు అనారోగ్యం కారణంగానే బయటకు వచ్చేశారు.

అభిజిత్‌కు గాయాలు..
అభిజిత్ ఫిజికల్ టాస్కుల్లో అంతగా పర్ఫామ్ చేయలేకపోవడానికి గల కారణాలను ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అభిజిత్‌కు భుజానికి తీవ్రమైన గాయముందని, కాలికి కూడా గాయమైందని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. అభిజిత్ భుజానికి గాయమైన నాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అందుకే అలా..
అభిజిత్ తనకున్న ఆరోగ్య సమస్యల మూలానే ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటున్నాడు. ఇంట్లో ఎప్పుడూ కూడా తన భుజానికి సంబంధించిన వామ్ అప్ చేస్తూనే ఉంటాడు. ఈ కారణంగానే అభిజిత్ టాస్కుల్లో చురుకుగా పాల్గొనడు. అదే అతనికి పెద్ద మైనస్‌గా మారింది.

కమాండో ఇన్‌స్టిట్యూట్..
కమాండో ఇన్‌స్టిట్యూట్ టాస్క్‌లో అభిజిత్ కాస్త ఒళ్లు వంచాడు. అక్కడ మాత్రం ఫిజికల్ టాస్కులు చేశాడు. రన్నింగ్ చేయడం, వేలాడడం వంటివి చేస్తూ స్టార్ సంపాదించాడు. కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించాడు.కానీ కెప్టెన్ కాలేకపోయాడు. అయితే తాజగా మరో టాస్క్‌లో అభిజిత్ పాల్గొన్నట్టు తెలుస్తోంది.

లీకులతో అలా..
బిగ్ బాస్ షోలో లీకులు అనేవి సంప్రదాయంగా మారాయి. ఒకప్పుడు ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నవి మాత్రమే తెలిసేవి. కానీ ఇప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్లు కూడా లీకవుతున్నాయి. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఇప్పుడు లీకవుతుంది. అందులో భాగంగా తాజాగా అభిజిత్‌కు సంబంధించిన లీకులు బయటకు వచ్చాయి.

టాస్క్‌లో గాయాలు..
నేటి ఎపిసోడ్‌లో అభిజిత్‌కు గాయాలు అవుతాయని తెలుస్తోంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద అభిజిత్ చేతులు, కాళ్లకు దెబ్బలు తగులుతాయట. ఇది నిజమే అయితే అభిమానులకు షాకే. అయితే అవి చిన్నపాటి గాయాలే అని అంటున్నారు. ఇంతకీ ఈ లీకులు నిజమో కాదో.. జైళ్లో ఉన్న అభిజిత్ బయటకు రావడం, ఈ టాస్కులు ఆడటం, గాయాలు అవ్వడం అంతా నిజమో కాదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











