నాగార్జునతో రికమండేషన్ చేయించుకుంటున్నాడు.. పాపం అభిజిత్ మరీ దారుణం!!

బిగ్ బాస్ షోలో అభిజిత్ హారిక బంధం బాగా ఫేమస్ అయింది. ఈ ఇద్దరిని కలిసి బయట ఫ్యాన్స్ అభిక అంటూ రచ్చచేశారు. హారిక, అభిజిత్ పేరెంట్స్ కూడా అభిక బంధాన్ని బాగా ఎంకరేంజ్ చేశారు. ఎంతో క్యూట్‌గా ఉందంటూ రిలేషన్‌పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. అయితే గత కొన్ని వారాలు అభిక బంధానికి బీటలు వారాయి. జలజ దెయ్యం టాస్క్ నుంచి ఈ ఇద్దరి మధ్య దూరం మొదలైంది. కన్ఫెషన్ రూంలో హారికకు నాగార్జున పీకిన క్లాస్‌తో మొత్తం మారిపోయింది.

అభిజిత్‌కు దూరంగా..

అభిజిత్‌కు దూరంగా..


అభిజిత్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను హారికకు చూపించారు. నీ ఆట నువ్ ఆడుకో.. అభిజిత్‌కు ఫేవరిటిజం చూపించకు అని హారికకు నాగార్జున గడ్డి పెట్టాడు. అలా దెబ్బకు దడుసుకున్న హారిక.. అభిజిత్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. అప్పటి నుంచి హారిక గ్రాఫ్ మొత్తం మారిపోయింది.

వారికి దగ్గరగా..

వారికి దగ్గరగా..

అభిజిత్‌కు దూరంగా ఉంటూ వచ్చిన హారిక.. మోనాల్, అఖిల్‌కు బాగా దగ్గరైంది. అక్కడే ఆమె గ్రాఫ్ పడిపోవడం ప్రారంభించింది. అభిజిత్‌ను హారిక ఎంత దూరం పెడుతోందో ఆ లెటర్‌తో తెలిసిపోయింది. ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ మీ అని రాసిన అభిజిత్ తన మనసులోని బాధను బయట పెట్టేశాడు.

గతవారంలోనూ..

గతవారంలోనూ..

గత వారంలోనూ అభిజిత్ హారికల మధ్య అంత సన్నిహిత సంబంధాలు కనపడలేదు. ఇదే విషయాన్ని నాగార్జునతో కూడా చెప్పాడు. ఆమె నన్ను కావాలని దూరం పెడుతోంది.. నాతో మాట్లాడటం లేదు సర్ అంటూ నాగార్జునతో అభిజిత్ తన బాధను చెప్పుకున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
ఇప్పుడూ అంతే..

ఇప్పుడూ అంతే..

అయితే నిన్నటి ఎపిసోడ్‌లోనూ అభిజిత్ అదే విషయాన్ని ప్రస్థావించాడు. హారిక మాట్లాడటం లేదు.. దూరంగానే ఉంటోంది అంటూ నాగార్జునతో తన బాధను చెప్పుకొచ్చాడు. ఒక వేళ ఎలిమినేట్ కాకుండా ఉంటే.. వచ్చే వారమైనా మాట్లాడమనండి సర్ అంటూ నాగార్జున చేత రికమండ్ చేయించుకున్నాడు. మరి హారిక అభిజిత్ మళ్లీ మునుపటిలా మాట్లాడుకుంటారో లేదో చూడాలి. ఇక మిగిలింది కూడా ఒకే ఒక్క వారం. మళ్లీ అభిక బంధం బయటకు వస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X