మోనాల్ వల్లే అదంతా జరిగింది.. మొత్తానికి ఆ విషయాన్ని బయట పెట్టేసిన అభిజిత్
బిగ్ బాస్ షోలో పద్నాలుగో వీకెండ్ ఎపిసోడ్‌లో మళ్లీ ఓ ఫిట్టింగ్ పెట్టాడు. ఉన్నది ఒక్క వారమే అయినా కూడా మళ్లీ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేలా టాస్క్ పెట్టాడు. ఇంటి సభ్యులందరూ కూడా మిగతా వారి గురించి ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గొడవలను గుర్తు చేసినట్టు అయింది. అలా అభిజిత్ తన మనసులోని మాటలు, బయట జనాలు అనుకుంటున్న మాటలను చెప్పాడు.

అభిజిత్ దృష్టిలో..
అభిజిత్ దృష్టిలో హారిక, సోహెల్, అరియానాలు నచ్చారు. అఖిల్ మోనాల్‌లు నచ్చలేదు. అయితే అరియానా, సోహెల్, హారికలపై ఫస్ట్, లాస్ట్ ఇంప్రెషన్ గురించి బాగానే చెప్పాడు. అంతా బాగానే ఉంది. అయితే మోనాల్ అఖిల్‌లో కూడా చెప్పడానికి అంత ఇష్యూస్ ఏమీ లేవని చెప్పాడు.

మోనాల్ గురించి..
అభిజిత్ మోనాల్ మీద కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాడు. మోనాల్ బాగా హైపర్ అనిపించింది.. మధ్యలో ఇద్దరికి బాగానే రిలేషన్ కుదిరింది. కానీ చివరకు ఆమె నేను రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లమని అర్థమైంది. మా ఇద్దరికి సెట్ కాదని తెలిసిందంటూ చెప్పుకొచ్చాడు.

అఖిల్ గురించి..
అఖిల్‌ను మొదటగా చూసినప్పుడు మంచి వాడు.. కూల్ గాయ్ అనుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. అయితే మోనాల్ అనే చాప్టర్‌ను తీసేస్తే అఖిల్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యేవాడు. ఆ ఒక్క టాపిక్ వల్ల అఖిల్ నేను దూరమయ్యామంటూ చెప్పుకొచ్చాడు.

మోనాల్ వల్లే అలా..
అయితే బయట జనాలు కూడా అభిజిత్ మాట్లాడిన మాటలనే చెప్పుకుంటున్నారు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా అదే చెప్పారు. మోనాల్ వల్లే ఆ ఇద్దరూ శత్రువుల్లా మారిపోయారని, లేదా ఆ ఇద్దరే మంచి స్నేహితులయ్యేవారిని చెప్పేవారు.

మోనాల్ ఎలిమినేషన్..
పద్నాలుగో వారంలో మోనాల్ ఎలిమినేట్ అయిందనే టాక్ బాగా ప్రచారంలోకి వచ్చింది. నామినేషన్‌లోకి వచ్చిన అభిజిత్, అరియానా, మోనాల్, సోహెల్, హారికల్లో ఓట్లు మోనాల్‌కు బాగా తక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ఐదుగురు టాప్ 5లో చేరిపోయారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











