చీలిపోయిన అభిక ఫ్యాన్స్.. ఈ వారం హారిక గట్టెక్కడం గండమే!!
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఇమేజ్‌లు మారడానికి ఒక్క సీన్, ఒక్క డైలాగ్ చాలు. కంటెస్టెంట్ల ఇమేజ్‌లు మార్చడంలో బిగ్ బాస్ టీం ట్రిక్స్ కూడా బాగానే ప్లే చేస్తుంది. కావాలనే గొడవ పడే సీన్లు, దూరంగా ఉన్నా సీన్లను కట్ చేసి ప్లే చేస్తాడు. ఇలాంటి రియాల్టీ షోలో ఇమేజ్‌ను తారుమారు చేయడంతో బిగ్ బాస్ టీంకు కొత్తేమీ కాదు. కంటెస్టెంట్లు 24 గంటలు ఎలా ఉన్నా గానీ మనకు చూపించే ఓ గంట ఎపిసోడ్‌తో ఆటను మొత్తం మార్చేస్తాడు బిగ్ బాస్. ఇప్పుడు కెమెరాలన్నీ కూడా హారిక వైపు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నాయి.

మొదటి నుంచి అభిక అంటూ..
నాల్గో సీజన్ ప్రారంభమైన నాటి నుంచి అభిజిత్ హారికలు ఎంతో క్లోజ్‌గా ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరి క్యూట్ ఫ్రెండ్‌షిక్ ఎంతో మంది ఫిదా అయ్యారు. అందుకే అభిజిత్ హారికలను కలిపి అభిక అంటూ పిలవడం ప్రారంభించారు. అభిక ఫ్యాన్స్ ఇన్నాళ్లూ కూడా అభిజిత్ హారికలకు సరి సమానంగా ఓట్లు వేస్తూ వచ్చారు. ఇందులో ముఖ్యంగా అభిజిత్ ఫ్యాన్స్ హవానే ఉన్నట్టు కనిపిస్తోంది.

దూరమైన అభిక..
రెండు వారాల క్రితం నాగార్జున పీకిన క్లాస్‌తో హారిక తన ఆటను, బంధాలను మార్చుకుంది. అభిజిత్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే మోనాల్‌కు మరింత దగ్గరైంది. అఖిల్‌తో వ్యవహారం చాలా దూరంపోయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి అభిజిత్‌కు వ్యతిరేక వర్గమైన అఖిల్ మోనాల్ గ్యాంగ్‌లో కలిసిపోయింది.

హారిక చర్యలకు షాక్..
హారిక అభిజిత్‌ను దూరం పెట్టడం, అభిజిత్ ఆ విషయాన్ని పసిగట్టి అతను కూడా దూరంగానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో అరియానా అభిజిత్‌కు కాస్త దగ్గరవుతోన్నట్టు కనిపిస్తోంది. టాస్క్‌కు ఆల్ ది బెస్టె చెప్పే విషయంలో అటు మూలన కూర్చున్న అరియానా అభిజిత్ దగ్గరకు వచ్చి హగ్గు ఇచ్చి మరీ చెప్పింది. హారిక మాత్రం అభిజిత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అఖిల్‌కు హగ్గు ఇచ్చింది.

వ్యవహారం ముదురుతోంది..
హారిక అభిజిత్‌కు దూరంగా ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. కానీ అఖిల్ మోనాల్‌తో బాగా క్లోజ్ అవుతూ అభిని ఒంటరిలా చేసింది. పైగా అఖిల్‌తో హారిక చేసే సరసాలు, అఖిల్ హారికతో చేసే ఓవర్ యాక్షన్‌లతో వ్యవహారం ముదిరిపోతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో అయితే మరీ దారుణంగా ముద్దు కోసం హారికను సతాయించాడు అఖిల్. రాణిగా ఉన్నప్పుడు ఇస్తే బాగుండదట.. తరువాత ఇస్తానంటూ అఖిల్‌కు నచ్చజెప్పింది.
Recommended Video

అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్..
హారిక చేసే చేష్టలకు అభిజిత్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక హారికకు ఓటు వేసేది లేదని, అభిక ఫ్యాన్స్ కూడా అభిజిత్‌కే ఓటు వేయాలని సోషల్ మీడియాలో కామెంట్లతో ట్రెండ్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ వారం హారికకు మూడినట్టే కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌తో హారిక గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











