ఇంత దానికి అంత చేస్తుంది.. అందరూ అదే మాట.. అరియానాకు దెబ్బ మీద దెబ్బ
బిగ్ బాస్ షోలో అరియానాపై మొదటి నుంచి ఓ ఫిర్యాదు ఉంది. ఇంత పర్ఫామెన్స్ చేయమంటే అంత చేస్తూ ఉంటుందని కంటెస్టెంట్లు పదే పదే చెబుతుంటారు. అభిజిత్ అయితే ఏకంగా అదే విషయంలో ఆమెను ఎన్నో సార్లు నామినేట్ చేశారు. మళ్లీ నిన్న కూడా అరియానా సోహెల్ విషయంలో అదే టాపిక్ వచ్చింది. అరియానా ఇంత చేయమంటే అంత చేస్తుందని సోహెల్, అభిజిత్ చెప్పుకొచ్చారు. పైగా నాగార్జున కూడా అదే చెప్పాడు. ఓవర్ రియాక్ట్ అయ్యావ్.. అంత అవసరమా? అని అరియానాను మందలించాడు.

వెరైటీ టాస్క్..
ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ అంటూ నాగార్జున ఓ ఆట ఆడించాడు. ఇంటి సభ్యులందరూ మిగతా వారి గురించి కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలన్నాడు. ముగ్గురు నచ్చినవాళ్లను..ఇద్దరు నచ్చనివారిని చెప్పాల్సి ఉంటుందన్నాడు.

అరియానాపై అదే ఫిర్యాదు..
అభిజిత్ తన దృష్టిలో అరియానా, సోహెల్, హారికలు నచ్చారని మోనాల్ అఖిల్ కొద్దిగా నచ్చలేదని అంత పెద్ద గొడవలేమీ లేవని చెప్పాడు. అయితే అరియానా మొదట వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది.. ఇంత చేయమంటే అంత చేస్తుంది.. అదే విషయంలో ఎన్నో సార్లు నామినేట్ కూడా చేశానని చెప్పాడు.

సోహెల్ కూడా..
సోహెల్ తన దృష్టిలో అభిజిత్ అఖిల్ మోనాల్ నచ్చారని, అరియానా హారిక నచ్చలేదని తెలిపాడు. అయితే సోహెల్ కూడా అరియానా గురించి అభిజిత్ చెప్పిందే మళ్లీ చెప్పాడు. టాస్కుల్లో ఇంత చేయమంటే అంత చేస్తుంది.. ఇక ఏం ఆలోచించదు.. పీక్స్‌కు వెళ్తుంది అని చెప్పుకొచ్చాడు.

నాగార్జున కూడా..
మొదట అరిచింది నువ్వే.. మీదకు వెళ్లింది కూడా నువ్వే.. మళ్లీ చివరకు అలా గార్డెన్ ఏరియాలో పడిపోయి మరీ ఏడ్వడం, ఎలాంటి హెల్ప్ లెస్ సీన్ ఉన్నట్టు అలా చేశావ్.. బాత్రూం ఏరియాలో అలా పడుకుని ఏడ్చావ్.. ఓ మగాడు మీద మీదకు వచ్చాడంటూ ఉమెన్ కార్డ్ తీశావ్.. అంత చేయడం అవసరమా? అని నాగార్జున ప్రశ్నించాడు.

అరియానా సైలెంట్..
నిన్నటి ఎపిసోడ్‌లో అరియానా దెబ్బకు సైలెంట్ అయింది. ఉమెన్ కార్డ్ తీసి తప్పు చేశావ్ అని నాగార్జున అనడంతో షాక్ తిన్నట్టుంది. ఏం మాట్లాడాలో తెలీక అరియానా మొహం మాడిపోయింది. ఎపిసోడ్ మొత్తం కూడా సెలైంట్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











