అందరిలోనూ అభిజిత్ వేరు.. మరోసారి అలా నిరూపించుకున్నాడుగా!!
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో మైండ్ పెట్టి ఆడే కంటెస్టెంట్లలో అభిజిత్ ముందుంటాడు. ఆ ఆలోచనలు ఒక్కోసారి ప్లస్ అవుతుంటాయి.. అవే మరోసారి మైనస్ అవుతుంటాయి. రోబో టాస్క్‌లో అభిజిత్ ఐడియా వర్కవుట్ అయింది. అదే క్రమంలో హోటల్ టాస్క్‌లో అభిజిత్ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయింది. అలా అభిజిత్ ఆలోచనలు మాత్రం వెరైటీగా, వింతగా ఉంటాయి. మైండ్‌ను పెట్టి ఆడటంలో అభిజిత్ ముందుంటాడు.
నిన్నటి ఎపిసోడ్‌లోనూ అభిజిత్ అదే వాడాడు. ఓపిక ఎవరికి ఎక్కువ అనే టాస్కులో భాగంగా డిస్టర్బ్ చేసేందుకు అందరూ రకరకాలుగా ప్రయత్నించారు. ముందుగా హాట్ సీట్ మీద కూర్చున్న అరియానాను డిస్టర్బ్ చేసేందుకు సోహెల్ నానా తంటాలు పడ్డాడు. మోనాల్ కూడా విపరీతంగా కష్టపడ్డాడు. కానీ అరియానా మాత్రం తన ఎక్స్‌ప్రెషన్స్‌లో కించిత్తు మార్పు కూడా కనబర్చలేదు. అంతే ధృడంగా చెక్కు చెదరకుండా నిల్చుని ఉంది.

అలాంటి సమయంలోనే అభిజిత్ ఓ ప్లేట్, గరిటను పట్టుకొచ్చాడు. సడెన్‌గా ఆమె చెవుల దగ్గరి పెట్టి సౌండ్ చేశాడు. అరియానా దెబ్బకు ఉలిక్కిపడింది. ఎమోషన్, ఎక్స్‌ప్రెషన్స్‌ను మార్చేసింది. అలా అభిజిత్ ప్లాన్‌ను సోహెల్ వాడాలని ప్రయత్నించాడు. ప్లేట్‌ను లాక్కుని సోహెల్ ప్రయత్నించాడు. అరియానా చెవుల వద్ద పెట్టి సౌండ్ చేశాడు. కానీ అరియానా కొంచెం కూడా ఉలిక్కి పడలేదు. అలా అభిజిత్ అందరిలోనూ భిన్నంగా ఆలోచిస్తాడని మరోసారి నిరూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











