టాప్ 5లో మోనాల్ ఉంటుందట.. అక్కడ కూడా అఖిల్ మారలేదు!!
బిగ్ బాస్ షోలో ప్రతీ క్షణం ఓ పరీక్ష లాంటిదే. వారు మాట్లాడే ప్రతీ మాట, తీసుకునే ప్రతీ నిర్ణయం కూడా వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అవన్నీ పరిగణలోకి తీసుకునే జనాలు కంటెస్టెంట్లను జడ్జ్ చేస్తారు. నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌కు ఓ పరీక్ష పెట్టాడు నాగార్జున. ఈ వారంలో ఎవ్వరినీ సేవ్ చేయడం లేదంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. నేరుగా టాప్ 5లోకి వెళ్లే కంటెస్టెంట్లను రివీల్ చేస్తానని తెలిపాడు.
అయితే దానికంటే ముందుగా అఖిల్‌కు ఓ టాస్క్ పెట్టాడు నాగార్జున. దాన్ని టాస్క్ అనేకంటే పరీక్ష అంటేనే కరెక్ట్‌గా ఉంటుంది. నీ దృష్టిలో టాప్ 5లోకి ఎవరు వస్తారని అనుకుంటున్నావో చెప్పు అంటూ అఖిల్‌ను ఇరికించాడు నాగార్జున. అయితే ఆ సమయంలో అఖిల్ ఏం చెప్తాడా అని అందరూ ఎదురుచూశారు. అక్కడ కూడా తన అనునయుల పేర్లే చెబుతాడా? లేక నిజాయితీగా చెబుతాడా? అన్నది నాగార్జున ఉద్దేశ్యం కావచ్చు.

నాగార్జున వేసిన వలలో అఖిల్ పడ్డాడు. మొదటి పేరు సోహెల్ అని చెప్పాడు. ఇక రెండో పేరు మోనాల్ అని చెప్పాడు. అక్కడే అఖిల్ దొరికిపోయాడు. అభిజిత్ పేరు చాలా కష్టంగానే చెప్పాడు. అయితే చివరకు హారిక అరియానాలో ఒకరి పేరు చెప్పాల్సి వచ్చింది. సోహెల్‌తో జరిగిన గొడవ కారణంగా అరియానా ఎలిమినేట్ అవుతందని అఖిల్ భావించాడో ఏమో గానీ హారిక టాప్ 5లో ఉంటుందని తెలిపాడు. మోనాల్ మీదున్న ప్రేమతో ఆమెను టాప్ 5లో చెప్పాడు కానీ.. నేడు ఎలిమినేట్ కాబోతోందని అఖిల్‌కు తెలియదు.


Click it and Unblock the Notifications











