అమాంతం అఖిల్ మీద పడుకున్న హారిక.. హద్దులు దాటుతోన్న వ్యవహారం!
బిగ్ బాస్ షోలో గత కొన్ని రోజులుగా ట్రాకులు మారుతూనే ఉన్నాయి. షోలో అభిజిత్ హారిక బంధానికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తున్నాయి. అభిజిత్ కూడా హారికను మాట్లాడమంటూ..కొంత సమయాన్ని కేటాయించమను అని వేడుకునే వరకు పరిస్థితి వచ్చింది. గత రెండు వారాలుగా హారిక అభిజిత్‌కు దూరంగా అఖిల్‌కు దగ్గరగా ఉంటోంది. అఖిల్‌తో దగ్గరగా అంటే ఆ వ్యవహారం మరీ ముదురుతోంది.

హగ్గులు, కిస్సులు..
హారిక అఖిల్ వ్యవహారంపై మోనాల్ కూడా గుస్సా అయింది. బయటకు నవ్వుతూ చెప్పినా కూడా లోపల మాత్రం ఈర్ష్యతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. హరికతో అఖిల్ మరింత చనువుగా ఉండటం, మాటిమాటికి హగ్గులు ఇచ్చుకోవడం చూసి మోనాల్ భరించలేకపోతోన్నట్టు కనిపిస్తోంది. అదే విషయంలో పులిహోర రాజా అంటూ సెటైర్లు వేస్తే అఖిల్ హర్ట్ అయ్యాడు.

ముద్దులు కావాలంటూ..
ఇక రాజు రాణి టాస్కులో అయితే ఏకంగా హారికను ముద్దు పెట్టమంటూ మారాం చేసేశాడు. హారికకు సోహెల్ ముద్దు పెట్టాడు. నాక్కూడా ముద్దు పెట్టు అని హారికతో వాగ్వాదానికి దిగాడు అఖిల్. అలా రాణి మంత్రికి ముద్దు పెట్టొద్దు, కావాలంటే టాస్క్ అయ్యాక ముద్దు పెడతాను అని హారిక తప్పించుకుంది.

నిన్నటి ఎపిసోడ్‌లో అలా..
అలా అఖిల్ హారిక వ్యవహారం మరి ముదిరిపోతోంది. వంటగదిలోనూ వీరి సరసాలు శ్రుతిమించిపోతోన్నాయి. హారిక పని చేసుకుంటుంటే.. వెనకాల నుంచి వచ్చి హారికను హగ్ చేసుకుని ముచ్చట్టు పెట్టడం వంటివి సోషల్ మీడియాలో నెగెటివ్‌గా వెళ్తున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‌లోనూ అఖిల్ హారిక వ్యవహారం మరీ హద్దులు దాటినట్టు కనిపించింది.

బట్టల కోసం గొడవలు..
వీకెండ్‌లో వేసుకునే బట్టల కోసం సోహల్ అఖిల్ గొడవలు పెట్టుకున్నారు. మోనాల్ అన్న చిన్న మాటతో సోహెల్ అఖిల్ మధ్య గొడవలు జరిగాయి. సరదాగా జరిగిన సంభాషణ చివరకు సీరియస్ అయింది. తాను ఎప్పుడూ ఎవరి బట్టలు వేసుకోలేదు.. అడుక్కోలేదంటూ సోహెల్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు.

అఖిల్ మీద పడుకుని..
ఇక అలా ఆ ఇద్దరి మధ్య గొడవ అయ్యాక హారిక మధ్యలోకి దూరింది. కోపంతో ఉన్న అఖిల్‌ను కూల్ చేసేందుకు అతని మీద పడుకుంది. మీద పడుకుని అఖిల్ గట్టిగా వాటేసుకుని అసలు గొడవేంటి? అని కూల్ చేసేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఇలా ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











