ఆడవాళ్లంటే ఆటబొమ్మల్లా ఉందా?.. మగరాయుడిలా మారిన అరియానా

బిగ్ బాస్ ఈ పద్నాలుగో వారాన్ని ఇంటి సభ్యుల ఇష్టానికే వదిలేశాడు. అందరినీ నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్.. చివరికి ఓ అవకాశం ఇచ్చాడు. అందరూ ఎంటర్టైన్ చేయాలని, ఎవరైతే మంచి పర్పామెన్స్ ఇస్తారో వారికి ప్రేక్షకులను ఓట్లు అడిగే చాన్స్ వస్తుందని తెలిపాడు. అలా ఇంట్లో రాజా రాణి అనే టాస్క్‌ను పెట్టాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఓ కిరీటాన్ని పెట్టాడు. దాన్ని మొదల ఎవరు చేజిక్కించుకుంటారో వారు మొదటి రాజు అవుతాడని తెలిపాడు.

అలా సోహెల్ మొదటి రాజు అయ్యాడు. సోహెల్ రాజు అయ్యాక అరియానాను ఆడుకున్నాడు. కానీ రివర్స్‌లో అరియానాయే సోహెల్‌ను ఆడుకున్నాడు. అయితే సోహెల్ తరువాత మళ్లీ తన అధికారాన్ని అభిజిత్‌కు అప్పగించాడు. అభిజిత్ రాజు అయ్యాక అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఎక్కువ పుటేజ్ కూడా చూపించలేదు. అభిజిత్ తన రాజు అధికారాన్ని బజర్ మోగిన తరువాత హారికకు ఇచ్చాడు.

 Bigg Boss 4 Telugu Week 14 Ariyana Abhijeet Fun

అలా హారిక రాణి అయింది. రాణిగా మారిన హారిక రాజ్యంలో గొడవలు జరిగాయి. అయితే నేటి ఎపిసోడ్‌లో మోనాల్ రాణి అయింది. ఆమె హయాంలో ఇంట్లో జంబలకిడి పంబ అయినట్టు కనిపిస్తోంది. మగవాళ్లు ఆడవారిలా.. ఆడవారు మగవాళ్లలా నటించినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అరియానాకు అభిజత్ గర్ల్ ఫ్రెండ్ అయ్యాడు. అయితే తన గర్ల్ ఫ్రెండ్‌ అయిన అభిజిత్‌ను ఏడిపిస్తున్నందుకు అరియానా మగరాయుడిలా విరుచుకపడింది. ఆడ పిల్లలంటే ఆట బొమ్మల్లా ఉందారా? అంటూ ఫైర్అయింది. చూస్తుంటే ఈ రోజుకూడా అరియానానే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X