Bigg Boss 4 Telugu Elimination అందరూ అనుకున్నదే జరిగింది.. ఆమె ప్రయాణం ముగిసింది!!

బిగ్ బాస్ షోలో పద్నాలుగో వారం అందరికీ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ ఒక్క గండాన్ని దాటితే టాప్ 5 లిస్ట్ అనే రికార్డులోకి కంటెస్టెంట్లు ఎక్కేస్తారు. టాప్ 5 అనేది మామూలు విషయం కాదు. బిగ్ బాస్ షోలో ఇన్ని రోజులు ప్రయాణం చేస్తూ చివరి వరకు నిలబడం ఆషామాషీ వ్యవహారం కాదు. జనాలు కూడా టాప్ 5 కంటెస్టెంట్లగా ఎవరిని తీసుకురావాలో వారినే తీసుకొస్తారు. ఎవరు ఎలా ఆడుతున్నారు.. ఎవరి ప్రవర్తన ఏంటి? అన్నది పరిశీలించి ఓట్లు వేస్తుంటారు. అలా ఈ పద్నాలుగో వారంలో ఇంటి సభ్యులందరితో పాటు జనాలు కూడా ఎలిమినేషన్ విషయం గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూడసాగారు.

అందరినీ నామినేట్ చేశాడు..

అందరినీ నామినేట్ చేశాడు..


బిగ్ బాస్ షో చివరకు చేరుకోవడంతో నామినేషన్ ప్రక్రియను పెట్టలేదు. నేరుగా బిగ్ బాసే అందరినీ నామినేట్ చేసేశాడు. అలా అఖిల్ తప్పా అందరూ నామినేట్ అయ్యారు. ఫినాలె టికెట్ చేజిక్కించుకోవడంతో నామినేషన్, ఎలిమినేషన్ గొడవల్లోంచి పక్కకు తప్పుకున్నాడు. ఇక అరియానా, అభిజిత్, హారిక, సోహెల్, మోనాల్‌లకు ఎలిమినేషన్ భయం పట్టుకుంది.

ఆ ఇద్దరే టార్గెట్..

ఆ ఇద్దరే టార్గెట్..


బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు ముందుగానే ఒకటి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. సోహెల్ అభిజిత్ అరియానా అనేవాళ్లు టాప్ 5లో ఉండాల్సి కంటెస్టెంట్లు అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. మధ్యలో సోహెల్ అరియానా గొడవలు కాస్త గందరగోళాన్ని క్రియేట్ చేసినా కూడా జనాలు మాత్రం తమ నిర్ణయాన్ని ముందే ఫిక్స్ చేసుకున్నట్టున్నారు.

మోనాల్ లేదా హారిక..

మోనాల్ లేదా హారిక..

పద్నాలుగో వారం నామినేషన్ లిస్ట్ బిగ్ బాస్ చెప్పడంతో అందరూ ధృడంగా నిశ్చయించుకున్నారు. హారిక లేదా మోనాల్‌ను ఇంటి నుంచి బయటకు పంపించాలని ఫిక్స్ అయ్యారు. మొదటి రెండు రోజులు అయితే హారిక మీద విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. ఆ ఊపు చూస్తుంటే ఈ వారం హారికనే ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. అయితే ఎప్పటి నుంచో మోనాల్‌ను కావాలని సేవ్ చేస్తూ వస్తున్నారనే కోపంతో ఆడియెన్స్ ఉన్నారు.

మొత్తానికి కథ ముగిసింది...

మొత్తానికి కథ ముగిసింది...


ఎప్పుడో ముగియాల్సిన మోనాల్ కథను ఇన్నాళ్లు బిగ్ బాస్ లాక్కొచ్చాడు. మొత్తానికి మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అయిందని టాక్ బయటకు వచ్చేసింది. ఇన్నాళ్ల శ్రమ ఫలించిదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి టాప్ 5లోకి సరైన కంటెస్టెంట్లే వెళ్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

డేంజర్ జోన్‌లోంచి..

డేంజర్ జోన్‌లోంచి..


పద్నాలుగో వారంలో హారిక కూడా డేంజర్ జోన్‌లోనే ఉందని తెలుస్తోంది. ఓటింగ్ సరళిని, శాతాన్ని బట్టి చూస్తే అందరికంటే అభిజిత్ టాప్ ప్లేస్‌లొ ఉన్నాడని, మోనాల్ చివరి ప్లేస్‌లో ఉందని తెలుస్తోంది. కాస్త తేడా జరిగి.. టీఆర్పీ కోసం మోనాల్‌ను మళ్లీ సేవ్ చేస్తే హారిక ఎలిమినేట్ అయ్యేదని టాక్ నడుస్తోంది. అసలు ఇంతకీ మోనాల్ ఎలిమినేషన్ నిజమా? కాదా? అసలు సంగతి ఏంటన్నది ఆదివారం నాటి ఎపిసోడ్‌లో క్లియర్‌గా తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X