అభిజిత్‌పై హారికకు ప్రేమ, భయం.. అరియానా రాయబారం విఫలం.. అలా తిప్పి కొట్టేశాడు!!
బిగ్ బాస్ షోలో పద్నాలుగో వారం చాలానే వింతలు జరిగాయి. హారిక తన చేజేతులారా నెగెటివిటీని మూటగట్టుకుంది. అభిజిత్‌ను దూరం పెట్టి మోనాల్, అఖిల్ పంచన చేరింది. అలా ఒకానొక దశలో హారిక ఎలిమినేషన్ ఫిక్స్ అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అభిక ఫ్యాన్స్ కూడా చీలిపోయారు. అభిజిత్ హారికల మధ్య ఓట్లు చీలిపోయాయి. హారికకు తక్కువ ఓట్లు వచ్చాయనే టాక్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే హారిక అభిజిత్ మధ్య కోల్డ్ వార్, మూగ బంధం నడుస్తోన్నట్టు కనిపిస్తోంది.

నాతో గడుపు..
హారిక తనకు దూరంగా ఉంటోంది.. మాట్లాడటం లేదని బాధపడ్డాడు అభిజిత్. ఒక రోజు రాత్రి ఇక బాధను భరించలేక.. ప్లీజ్ స్పెండ్ టైం విత్ మీ అంటూ లెటర్ రాసేశాడు. అలా అప్పటి నుంచి హారిక కాస్త దగ్గరైనట్టు, మాట్లాడినట్టు కనిపిస్తోంది. అయితే అభిజిత్ మాత్రం హారికపై ప్రేమతో కూడా కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది.

నిన్నటి ఎపిసోడ్‌లో అలా..
అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి మధ్య ఉన్న క్యూట్ గొడవలు మరోసారి బయటకు వచ్చాయి. అరియానా హారికలు అభిజిత్ గురించి ముచ్చటించుకున్నారు. ఉదయం పూట టీ టైంలో అభిజిత్ గురించి అరియానా, హారికలు సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఎంత క్యూట్‌గా..
హారిక, అరియానాలు బ్లూ సోఫాలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే అభిజిత్ మాత్రం అక్కడ కూర్చోక వెరే చోటకు వెళ్లి కూర్చున్నాడు. ఎంత క్యూట్‌గా తింటాడో అంటూ అభిజిత్‌పై హారిక ప్రేమను కురిపించింది. అభిజిత్ చెప్పాలా? అంటూ అరియానా చొరవచూపించింది. వద్దు తిడతాడంటూ హారిక వారించింది.

డైవర్ట్ చేసేశాడు..
హారిక అన్న మాటలను అభిజిత్‌కు వినిపించేలా అరియానా అరిచేసింది. అలా అరియానా చెప్పడంతోనే వెంటనే అభిజిత్ టాపిక్ డైవర్ట్ చేసేశాడు. పెరుగు తోడేసింది నువ్వేనా? అంటూ అభిజిత్ అరియానాతో మాట దాటేశాడు. అదేంటి నేను చెప్పేది వినకుండా వెంటనే మాట మార్చేశాడేంటి? అని అరియానా షాక్అయింది.

అన్నీ తెలుసు..
అన్నీ తెలుసు అన్నీ చూస్తుంటాడు.. దొంగ.. అద్దంలోంచి మనిద్దరినీ చూస్తుంటాడు అంటూ హారిక అభిజిత్ గురించి చెప్పింది. అభిజిత్ చాలా ఇంటెలిజెంట్ కదా అని అరియానా అంటే.. నా ఫ్రెండ్ అంటే మినిమం ఉండాలి కదా అని హారిక బిల్డప్ ఇచ్చుకుంది. మొత్తానికి అభిజిత్ హారిక మధ్య మళ్లీ మునుపటి బంధం ఏర్పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











