గోవిందా గోవిందా.. మోనాల్‌ను అలా సింబాలిక్‌గా చూపించారా.. జరిగేది అదేనా?
బిగ్ బాస్ షో తుది అంకానికి చేరుకుంది. ఇక నేటి అసలు కథ తేలనుంది. ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యుల్లోంచి అఖిల్ ఆల్రెడీ టాప్ 5లోకి వెళ్లిపోయాడు. ఇక మిగిలిన ఐదుగురిలోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఆడియెన్స్ తమ ఓట్లతో తీర్పును చెప్పారు. అయితే బిగ్ బాస్ ఆ తీర్పును ప్రకటించాల్సి ఉంది. అది ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందా? లేదా వ్యతిరేకంగా ఉంటుందా? అని ఇప్పుడే చెప్పలేం. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం కొన్ని షాట్స్ సింబాలిక్ ఎలిమినేషన్ గురించి హింట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

నిన్నటి ఎపిసోడ్‌లో..
ఓట్లు అప్పీల్ చేసుకునే టాస్క్‌లో భాగంగా నిన్న చివరగా మోనాల్‌కు అవకాశం దక్కింది. నాన్ స్టాప్ డ్యాన్స్ చేసే టాస్కులో హారిక త్యాగం చేయడంతో మోనాల్‌కు గోల్డెన్ మైక్ దక్కింది. తనను మోసి కెప్టెన్‌గా చేసినందుకు రుణం తీర్చుకుంటున్నాను అని చెప్పి మోనాల్‌కు చాన్స్ ఇచ్చింది. అలా చివరకు మోనాల్ గోల్డెన్ మైక్ పట్టుకుని ప్రేక్షకులతో మాట్లాడింది.

అర్దరాత్రి చర్చలు..
మోనాల్ కన్ఫెషన్ రూంలో ఓట్లు అప్పీల్ చేసుకోవడం ఓ వైపు జరుగూతూనే ఉంది. మరో వైపు సోహెల్ ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు. ఇక చివరకు అర్దరాత్రి దాటాకు కూడా సోహెల్ తన బాధ గురించి చెప్పుకుంటూనే ఉన్నాడు. అభిజిత్ హారికలతో సోహెల్ డిస్కషన్ పెట్టాడు.

కట్ చేసి మోనాల్ పుటేజ్ చూపించాడు..
అలా అక్కడ అభిజిత్ కరెక్ట్ పాయింట్లు మాట్లాడుతూ.. సోహెల్ హారికల చర్చ నడుస్తూ ఉంటే.. అదంతా కట్ చేసిన మోనాల్ పుటేజ్ చూపించాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద మోనాల్ సంబరపడుతున్న పుటేజ్‌ను చూపించాడు. గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేసుకుంటూ మోనాల్ చిల్ అవుతున్న షాట్‌తోనే ఎపిసోడ్ ఎండ్ చేసేశాడు.

సింబాలిక్‌గా చూపించాడా?..
మోనాల్‌ను అలా ఎపిసోడ్ ఎండింగ్‌లో చూపించడం, గోవిందా గోవిందా అని చెప్పడం చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మోనాల్ ఎలాగూ ఎలిమినేట్ అవుతుందని ఇలా చివర్లో షాట్ వేశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వారంలో మాత్రం హారిక లేదా మోనాల్‌కు ఎలిమినేషన్ అనే తాడు బిగిసుకునేలా కనిపిస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











