బిగ్ బాస్ ఆటలో అందరూ ఒక్కటే.. ఉమెన్ కార్డ్ వాడావ్.. అరియానాకు నాగార్జున అక్షింతలు!

బిగ్ బాస్ షోలో మొదటి నుంచి ఒకటే నియమం. అందులో ఆడ మగ అని తేడా లేదు.. అందరి కష్టం ఒక్కటే.. విజయం ఒకటే. లింగబేధమనేది ఉండదు.. అందరూ సమానమే. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం ఆడ, మగ అంటూ తేడా చూపిస్తుంటారు. హోస్ట్‌గా ఉన్న నాగార్జున కూడా ఆ మధ్య ఓ సారి అదే విషయాన్ని చెప్పాడు. ఆడ పిల్లల జోలికి వచ్చినా, వారిపై అరిచినా కొరడా ఝులిపిస్తానని హెచ్చరించాడు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ఎవరి వైపు స్టాండ్ తీసుకోకుండా నిష్పక్షపాతంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది.

సోహెల్ అరియానా విషయం..

సోహెల్ అరియానా విషయం..


ఎవరికి ఓపిక ఎక్కువ అనే టాస్క్‌లో అరియానా సోహెల్ ఒకరిపై ఒకరు ఎంతలా విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో మాత్రం ఇద్దరిది తప్పు ఉంది. అరియానా రెచ్చగొట్టే మాటలు మాట్లాడం, సోహెల్‌పైకి వెళ్లడం, అలా గొడవ తారాస్థాయికి వెళ్లింది.అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఒకరి మీదకు మరొకరు వెళ్లారు. అక్కడితో గొడవ ఆగిపోయి ఉంటే నిజంగానే సోహెల్ బ్యాడ్ అయ్యేవాడు.

వుమెన్ కార్డ్‌తో బ్లాక్ మెయిల్..

వుమెన్ కార్డ్‌తో బ్లాక్ మెయిల్..

అరియానా ఎంత అరిచిందో.. సోహెల్ కూడా అంతే అరిచాడు. కానీ చివరకు అరియానా మాత్రం తాను ఓ అమ్మాయిని.. అలా అమ్మాయి మీద మీదకు వస్తే ఎలా ఉంటుంది.. అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ సోహెల్‌ను బ్యాడ్ చేసే పని పెట్టుకుంది. ఇదే విషయంలో అఖిల్ కూడా మందలించాడు. సోహెల్ మీద అలాంటి ముద్ర వేయకు అని సూచించాడు. సోహెల్‌కు సపోర్ట్ చేస్తున్నావ్.. ఈ టాపిక్‌లో నువ్ మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంటూ అఖిల్‌ను అరియానా పక్కకు జరిపేసింది.

అందరూ అదే అనుకున్నారు..

అందరూ అదే అనుకున్నారు..


అరియానా సోహెల్ విషయంలో ఎవరికి తోచినట్టుగా వారు అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు సోహెల్‌దే తప్పు అన్నారు.. ఇంకొందరు అరియానాది కూడా తప్పే అన్నారు. మరికొందరు ఇద్దరిదీ తప్పే అన్నారు. అయితే వీకెండ్ ఎపిసోడ్‌లొ ఎలాగూ నాగార్జున అమ్మాయిల సైడ్ తీసుకుంటాడు.. సోహెల్‌ను బాగా రోస్ట్ చేస్తాడని అభిప్రాయ పడ్డారు. కానీ నాగార్జున మాత్రం ఎవరి పక్షాన్ని తీసుకోలేదు.

ఇద్దరికీ అక్షింతలు..

అరియానా సోహెల్ విషయాన్ని నాగార్జున ప్రస్థావిస్తూ ఇద్దరికీ అక్షింతలు వేసినట్టు ప్రోమో చెబుతోంది. ఇందులో అరియానాకు గట్టి పంచ్ పడ్డట్టు కనిపిస్తోంది. మొదలుపెట్టింది నువ్వే..అరిచింది నువ్వే..చివరకు ఉమెన్ కార్డ్ వాడావ్.. బిగ్ బాస్ ఆటలో అందరూ ఒక్కటే అంటూ నాగార్జున మందలించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. నాగార్జున కరెక్ట్‌గా మాట్లాడాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X