ఎంత దారుణంగా ప్రవర్తించావో తెలుసా?.. నాగార్జున ఫైర్.. మాడిపోయిన అరియానా మొహం
బిగ్ బాస్ షోలో చివరి వీకెండ్ ఎపిసోడ్‌ను నాగార్జున బాగానే బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. ఇక మిగిలింది ఒకే వారం. అందరూ ఫినాలేలోకి అడుగుపెడుతున్నారు. ఇది చివరి వీకెండ్ ఎపిసోడ్. వచ్చే వారం ఫినాలె ఎపిసోడ్ గ్రాండ్‌గా జరగనుంది. అందుకు ఈ వారం ఎవరికివ్వాల్సిన కోటా వారికి ఇచ్చాడు. పక్షపాతం లేకుండా తప్పు చేసిన వారిని కడిగిపారేశాడు. మొత్తానికి అరియానా సోహెల్ విషయాన్ని పరిష్కరించేశాడు.

అలా టాస్క్..
ఇది చివరి వారం కాబట్టి.. ఇంటి సభ్యులకు వెరైటీ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో రాగానే కలిగిన మొదటి ఇంప్రెషన్, ఇప్పుడున్న ఇంప్రెషన్ చెప్పాలని తెలిపాడు. అలా నచ్చిన ముగ్గురిని, నచ్చని ఇద్దరిని చెప్పాల్సి ఉంటుందన్నాడు. అలా నాగ్ ప్రమేయం లేకుండా ఇంటి సభ్యుల తమ మధ్య ఉన్న గొడవలను బయటపెట్టేశారు.

అరియానా అలా..
అరియానా తనకు అభిజిత్ హారిక మోనాల్ నచ్చారని.. అఖిల్ సోహెల్ అంతగా నచ్చలేదని తెలిపింది. సీక్రెట్ రూంలో ఉన్నప్పుడే అతని ఆలోచనలు, తన ఆలోచనలు పడవని అర్థమైందని తెలిపింది. సోహెల్ మంచివాడే కానీ కాస్త కోపం తగ్గించుకోవాలి, మాట్లాడేటప్పుడు ఆ టోన్ కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుందని అరియానా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నాగార్జున ఆ గొడవను ప్రస్థావించాడు.

నాగ్ సీరియస్..
అయితే అరియానా, సోహెల్ ఇద్దరూ తప్పు చేశారని నాగార్జున మందలించాడు. టాస్క్‌లో అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావ్.. బయట అయితే కంట్రోల్ చేసుకోలేవా? అని సోహెల్‌పై మండిపడ్డాడు. మొదట నువ్వే అరిచేసావ్.. తరువాతే సోహెల్ అరిచాడు.. అంటూ అరియానాకు నాగార్జున తన అభిప్రాయాన్ని చెప్పాడు. అలా మీద మీదకు వెళ్లడం సోహెల్ తప్పు అని నాగ్ చెప్పాడు.

ఎంత ఘోరంగా ప్రవర్తించావో..
సోహెల్ నువ్ బాగానే అనుకున్నారు.. అంతా అయిపోయింది.. మళ్లీ ఆ తరువాత నువ్ లాన్‌లో అంత కింద పడి ఏడ్వాల్సిన అవసరం లేదు.. అక్కడ ఎంత ఘోరంగా ప్రవర్తించావో తెలుసా? మళ్లీ బాత్రూంలో కిందపడి ఏడుస్తూ ఉమెన్ కార్డ్ తీశావ్ అది చాలా తప్పంటూ నాగ్ మందలించాడు. దీంతో అరియానా మొహం మాడిపోయింది.

నాగ్ ప్రశ్న..
సోహెల్ గోల్డెన్ మైక్ పట్టుకుని కన్ఫెషన్ రూంలోకి వెళ్లిన వెంటనే నువ్ బాత్రూంలో మళ్లీ ఏడుపు స్టార్ట్ చేశావ్.. ఉమెన్ కార్డ్ తీస్తూ సోహెల్ మీద మీదకు వచ్చాడని అన్నావ్.. దాని ఉద్దేశ్యమేంటి అరియానా అంటూ నాగార్జున ప్రశ్నించాడు. అతడిని బ్యాడ్ చేయాలని తాను అలా చేయలేదని, బాధను బయటపెట్టుకున్నానంటూ అరియానా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











