నోయల్ అలా రాహుల్ ఇలా.. హారికపై నెగెటివ్ కామెంట్స్ అంటూ వీడియో
బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. అసలు ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో అఖిల్ ఫైనల్స్‌కు వెళ్లాడు. మిగిలిన ఐదుగురు నామినేషన్‌లోకి వచ్చారు. ఈ వారంలో సపరేట్ నామినేషన్ ప్రక్రియ ఏమీ పెట్టకుండా అందరినీ బిగ్ బాస్ నామినేట్ చేసేశాడు. అయితే నేరుగా ఓ టాస్క్ ఇచ్చేసి.. అందులో బెస్ట్ పర్ఫామెన్స్ చేసిన వారికి ప్రేక్షకులను ఓట్లు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఇస్తానన్నాడు.

రాజా-రాణి టాస్క్..
అఖిల్ తప్పా మిగిలిన అందరూ కూడా రాజా, రాణి టాస్క్‌లో పాల్గొంటారని బిగ్ బాస్ తెలిపాడు. రాజుగా, రాణిగా మారిన తరువాత తమ ఇష్టమున్న నియమాలను రాసుకోవచ్చని, బాగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకులను మెప్పించాలని బిగ్ బాస్ పేర్కొన్నాడు. అయితే సోహెల్ మొదటి రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తరువాత అభిజిత్ రాజయ్యాడు.. ఆ తరువాత హారిక రాణిగా మారింది.

హారికపై నెగెటివ్ కామెంట్స్..
అభిజిత్ హారికలు మధ్య దూరం పెరిగిందని కనిపిస్తోంది. హారిక అభిజిత్‌కు దూరంగా అఖిల్ మోనాల్‌కు దగ్గర అవుతోంది. అఖిల్‌తో మరింత సన్నిహితంగా కనిపిస్తోంది. నిన్నటి టాస్క్‌లో హారిక ప్రవర్తన, ఆమె చేష్టలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు హారికపై అభిక ఫ్యాన్స్, అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

రాహుల్ అలా..
రాహుల్ సిప్లిగంజ్ ఎప్పటిలానే సోహెల్, అరియానాలకు సపోర్ట్ చేయండని పోస్ట్ పెట్టాడు. అరియానాకు పది ఓట్లు వేసినట్టుగా చూపించాడు. అయితే అభిజిత్‌కు ఆల్రెడీ సపోర్ట్ ఉందని, మిగతా వాళ్లలో మంచి వాళ్లను టాప్ 5లోకి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతోనే సోహెల్, అరియానా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు సపోర్ట్ చేస్తున్నాని చెబుతున్నాడు.

నోయల్ ఇలా..
అయితే నోయల్ కాసేపటి క్రితమే ఓ వీడియోను షేర్ చేశాడు. కంటెస్టెంట్లకు సపోర్ట్ చేసే విషయంలో రాహుల్ నోయల్ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని కనిపిస్తూనే ఉన్నాయి. అభిజిత్ హారికలకు సపోర్ట్ చేయాలని నోయల్ అందరినీ కోరాడు. వారిద్దరూ ఎంతో మంచి వారని, వారిద్దరూ స్నేహితులేనని చెప్పుకొచ్చాడు.
Recommended Video

నెగెటివ్ కామెంట్స్..
హారికపై నిన్నటి నుంచి నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయని, నా బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో పడేశారని అంటున్నారు.. అది టాస్క్.. అక్కడ నిజంగా ఏం జరిగిందో వాళ్లు చెబితే గానీ ఎవ్వరికీ సరిగ్గా తెలియదు.. ఆ ఇద్దరూ మంచి స్నేహితులు.. అభిజిత్ టాప్ 5లో ఉంటాడు.. ఈ సమయంలో హారికకు ఎంతో సపోర్ట్ కావాలి.. ఆమెకు ఓట్లు వేయండని నోయల్ అందరినీ కోరాడు.


Click it and Unblock the Notifications











