నువ్వేం చేయవని తెలుసురా.. సోహెల్ పరువుదీసిన హారిక.. అరియానాపై పగ

బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. మిగిలింది ఒక్క వారమే. ఇవే చివరి నామినేషన్స్ అని చెప్పి అందర్నీ నామినేట్ చేసి పడేశాడు బిగ్ బాస్. ఫినాలే టిక్కెట్ సొంతం చేసుకున్న అఖిల్ మాత్రం బతికిపోయాడు. మిగిలిన ఐదుగురు నామినేషన్‌లోకి వచ్చారు. ఈ వారం అంతా ప్రదర్శన చేసిన ఆడియెన్స్‌ను మెప్పించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో కొన్ని టాస్కులను ఇచ్చాడు. అందులో ఒక్కొక్కరి ప్రవర్తన బయటకు వస్తోంది.

రాజు, రాణి టాస్క్..

రాజు, రాణి టాస్క్..


ఇంట్లో రాజు, రాణి టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. వారి ఇష్టాలకే వదిలేశాడు. రాజు, రాణిలుగా బాధ్యతలు స్వీకరించిన వారు వారి ఇష్టమొచ్చినట్టుగా ఇంటి నియమాలను మార్చుకోవచ్చని తెలిపాడు. కొత్త రోల్స్ పెట్టొచ్చు, బిగ్ బాస్ నియమాలను మార్చుకోవచ్చని తెలిపాడు. ఈ క్రమంలో మొదటి రాజుగా సోహెల్ కిరీటాన్ని ధరించాడు.

గొడవలతో అలా..

గొడవలతో అలా..

ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని బిగ్ బాస్ చెబితే.. మళ్లీ గొడవలకే దారి తీసింది. రాణిగా మారిన హారిక, మంత్రిగా ఉన్న అఖిల్ చేష్టలకు సోహెల్ హర్ట్ అయ్యాడు. వారి మీద ఫైర్ అయ్యాడు. తాను ఎంత కామెడీగా చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను.. వాళ్లిద్దరూ ఎలా చేస్తున్నారంటూ హారిక, అఖిల్‌పై సోహెల్ ఫైర్ అయ్యాడు. స్విమ్మింగ్ పూల్‌లో బట్టలు పడేయడం, పదిహేను సెకన్లలో షూలు వేసుకుని రావడం, లేస్ కట్టుకుని డ్యాన్సులు చేయించడం ఏం టాస్కులని సోహెల్ ఫైర్ అయ్యాడు.

నేడు అలా..

నేడు అలా..

రాజు రాణి ఆట ఆడించిన బిగ్ బాస్ నేడు ఇంటి సభ్యుల్లో ఎవరికి ఓపిక ఎక్కువ అనే దాన్ని పరిశీలించినట్టున్నాడు. ఈ మేరకు మొదటగా హాట్ సీట్‌పైకి అరియానా ఎక్కి కూర్చుంది. ఇక అరియానాను ఆట పట్టించేందుకు సోహెల్ కాస్త శాడిస్ట్‌లానే ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality

ఏం చేయవని తెలుసురా..

అరియానాను కిందకు దించేందుకు ఆమెకు చిరాకు తెప్పించేందుకు సోహెల్ భారీ స్కెచ్‌లో వేశాడు. అయితే హారిక మాత్రం.. నువ్వేం చేయవని తెలుసురా? అంటూ సెటైర్ వేయడంతో సోహెల్ హర్ట్ అయి గ్లాసును పగలగొట్టేశాడు. ఇక అరియానా మీద పగతోనే కోపంతోనో టాస్క్ కోసమో గానీ ఆమె డ్రెస్, చింటు బొమ్మను నాశనం చేస్తున్నట్టుగా ప్రోమోను వదిలారు. మరి నిజంగానే వాటిని నాశనం చేశాడో లేదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X