మోనాల్‌ను హైద్రాబాద్‌లోనే ఉండమన్నాడట.. అఖిల్ మామూలోడు కాదు
బిగ్ బాస్ షోలో అఖిల్ మోనాల్ కథ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. మోనాల్ రెండు పడవల ప్రయాణం, చివరకు అఖిల్‌తోనే సన్నిహితంగా ఉండటం, అభిజిత్‌తో పూర్తిగా దూరంగా ఉండటం అందరికీ తెలిసిందే. చివరకు ఎలిమినేషన్ సమయంలోనూ అభిజిత్ మోనాల్ సరిగ్గా మాట్లాడుకోలేదు. పైగా వెళ్లే ముందు అభిజిత్‌కు మోనాల్ పంచ్ వేసింది. తాను ఉండటం వల్లే అఖిల్ ఫ్రెండ్ కాలేకపోయాడని చెప్పావ్ కదా ఇప్పుడు వారం రోజుల సమయం ఉంది ఫ్రెండ్స్ అవ్వండంటూ పంచ్ వేసింది.

మోనాల్ ఎలిమినేషన్..
మోనాల్ ఎలిమినట్ అవుతుందని అఖిల్ అస్సలు ఊహించలేదు. పైగా మోనాల్ టాప్ 5లో ఉంటుందని ఎంతో నమ్మకంగా చెప్పాడు కూడా. కానీ చివరకు అఖిల్ అంచనాలు తలకిందులు అయ్యాయి. మోనాల్ ఎలిమినేట్అయింది. అయితే ఆ షాక్‌లోంచి అఖిల్ బయటకు రావడం లేదు.

ఒంటరిగానే అఖిల్..
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్ ఒంటరిగానే బాధపడ్డాడు. ఎందుకిలా అవుతోంది.. ఏం జరుగుతోందంటూ మోనాల్ ఊసులో పడిపోయాడు. ఇక ఇదే విషయంపై హారికతోనూ చర్చించాడు. ఇద్దరూ కలిసి మోనాల్ గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. గార్డెన్ ఏరియాలోని సోఫాల వద్ద కూర్చుని అఖిల్ తన బాధను హారికతో చెప్పుకున్నాడు.

ఎవరో ఒకరు కావాలి..
నీకు నీ బాధలు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు కావాలి.. ఆ ఒక్కరిని నువ్ మిస్ అవుతున్నావ్ కదా అంటూ అఖిల్‌కు హారిక కౌంటర్ వేసింది. అలాంటిదేమీ లేదు అంటూ అఖిల్ బుకాయించాడు. కానీ చివరకు ఓ విషయాన్ని బయటపెట్టాడు. మోనాల్‌ను ఈ వారం రోజులు హైద్రాబాద్‌లోనే ఉండమన్నాడట.
Recommended Video

హైద్రాబాద్‌లోనే..
మోనాల్ గురించి హారిక, అఖిల్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఓ విషయాన్ని చెప్పారు. వారం రోజులే కదా మళ్లీ మనం కలుసుకుంటాంలే అంటూ అఖిల్‌ను హారిక ఓదార్చింది. అయినా మోనాల్ ఇక్కడే ఉంటుందని తనను హైద్రాబాద్‌లో ఉండమని చెప్పాను.. బయటకు వచ్చాక కలుస్తానని చెప్పినట్టుగా అఖిల్ బయట పెట్టేశాడు. తాను కూడా మోనాల్‌కు అదే చెప్పానని హారిక కూడా తెలిపింది. అంటే ఈ వారం రోజులు మోనాల్ హైద్రాబాద్‌లోనే ఉండనుందన్న మాట.


Click it and Unblock the Notifications











