Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ రియాక్షన్‌ను ఇమిటేట్ చేస్తూ రచ్చ.. పరువు తీయకండంటూ వేడుకున్న అరియానా
అరియానా రియాక్షన్స్‌ను, ఊతపదాలను ఇంటి సభ్యులందరూ బాగానే ఇమిటేట్ చేస్తుంటారు. సీరియస్లీ, అమ్మతోడు అంటూ ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ను అందరూ బాగానే అనుకరిస్తుంటారు. అయితే నిన్నటి ఎపిసోడ్లో మాత్రంఅందరూ కలిసి అరియానాను ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఫైనలిస్ట్ అంటూ ప్రింట్ అవుట్ బయటకు రావడంతో అరియానాఇచ్చిన ఎపిక్ రియాక్షన్‌ను అందరూ ఇమిటేట్ చేసి పడేశారు.
కుప్పకూలిపోయింది..
ఆదివారం నాటి ఎపిసోడ్లో అరియానా ఫైనలిస్ట్ అని తేలిపోయింది.. మోనాల్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అరియానా ఇచ్చిన రియాక్షన్ మాత్రం అలాగే మిగిలిపోయింది. ప్రింట్ అవుట్లో అరియానా ఫైనలిస్ట్ అంటూ బొమ్మ రావడం, దాన్ని చూసి వెంటనే కూలిపోవడం, కిందపడి వింత హావభావాలను ఇవ్వడం అందరికీ గుర్తుంది.
ఇమిటేషన్‌తో రచ్చ..
అయితే అరియానా ఆ సమయంలో ఇచ్చిన రియాక్షన్లను నిన్నటి ఎపిసోడ్లో సోహెల్, హారిక, అఖిల్‌లు మళ్లీ చేసి చూపించారు. మరీ ముఖ్యంగా సోహెల్ అరియానాను ఆడుకున్నాడు. అచ్చం అరియానాలా కిందపడిపోవడం, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇమిటేట్ చేశాడు.
ముగ్గురు కలిసి..
గార్డెన్ ఏరియాలో అఖిల్, సోహెల్, హారికలు అందరూ కలిసి అరియానా రియాక్షన్‌ను ఇమిటేట్ చేశారు. అందరూ ఒక్కసారిగా కుప్పకూలి పోయి.. అరియానాలా యాక్ట్ చేశారు. ఆ తరువాత సోహెల్‌ను హత్తుకుని బాదిన రియాక్షన్‌ను కూడా చూపించాడు. తనను గట్టిగా దబాదబా వాయించేసి లవ్యూరా సోహెల్అని చెప్పిందటూ నటించి చూపించాడు.
Recommended Video
వేడుకున్న అరియానా..
అరే నా పరువు తీయకండి.. ఇప్పటికే పది సార్లు చేసి చూపించావ్రా.. నా పరువు తీయకురా అంటూ అరియానా వేడుకుంది. కానీ ఎవ్వరూ శాంతించలేదు. అందరూ అరియానాను ఇమిటేట్ చేస్తూనే వచ్చారు. అది నా నిజమైన ఎమోషన్ అంటూ అరియానా చెప్పుకొచ్చింది. మొత్తానికి అరియానాల నటించి ఆమె రియాక్షన్‌ను కామెడీ చేసేశారు.