Don't Miss!
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ఎన్ని సార్లు బయటకు పంపిస్తారు.. బిగ్ బాస్‌పై అవినాష్ అసహనం
బిగ్ బాస్ షోలో వీకెండ్ ఎపిసోడ్‌ను కూడా రీయూనియన్ పేరిట కానిచ్చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో కొంతమంది కంటెస్టెంట్లు రాగా నేడు మిగిలిన కంటెస్టెంట్లు రానున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్, స్వాతి దీక్షిత్ కుమార్ సాయి, లాస్య కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చారు. ఎవరికి వారు తమదైన శైలిలో రచ్చ రచ్చ చేశారు. ఇక నేడు మరో లెవెల్‌లో ఎంటర్టైన్ చేసేందుకు మిగిలిన కంటెస్టెంట్లు రెడీ అయ్యారు.

దివి, మెహబూబ్ అలా..
దివి మెహబూబ్‌లు కలిసి ఎంట్రీ ఇచ్చారు. డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఈ ఇద్దరూ అదరగొట్టినట్టు కనిపిస్తుంది. మామూలుగానే మెహబూబ్ డ్యాన్సుల్లో అదరగొట్టేస్తుంటాడు.. అలాంటిది పక్కనే దివి ఉంటే ఊరుకుంటాడా. ఈ ఇద్దరూ డ్యాన్సులతో దుమ్ములేపుతుంటే.. అవతలి నుంచి ఇంటి సభ్యులందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.

గంగవ్వ సుజాతల ఎంట్రీ..
అఖిలు అంటూ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చినా కూడా అది నేటి ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది. ఇక గంగవ్వతో పాటే సుజాత కూడా వచ్చినట్టుంది. ఈ ఇద్దరూ కలిసి ఇంటి సభ్యులను ఓ ఆట ఆడించినట్టు కనిపిస్తోంది.

నోయల్ ర్యాప్..
ఇక నోయల్ తనకు అలవాటైన ర్యాప్‌తో రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. తన ర్యాప్ సాంగ్‌తో అందరిలోనూ ఉత్తేజాన్ని నింపినట్టు కనిపిస్తోంది. నోయల్ పాడుతూ ఉంటే అందరూ మంచి ఊపులో డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఆ తరువాత నోయల్ హారిక ముచ్చట్లు కూడా బాగానే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఏదో ఒక హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అవినాష్ రచ్చ..
అవినాష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన శైలిలో మిమిక్రీతో అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది. అవినాష్ అభిజిత్‌కు పంచ్ వేశాడు. అమ్మాయిలందరూ నంబర్ అడుతున్నారంటూ అభిజిత్‌ను చూసుకుంటూ.. నా నంబర్ అడుగుతున్నారంటూ కౌంటర్ వేశాడు. ఇంటి నుంచి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ అనడంతో అవినాష్ హర్ట్ అయినట్టున్నాడు. ఎన్నిసార్లు బయటకు పంపిస్తారు.. అలాంటప్పుడు ఎందుకు పిలిచారంటూ సెటైర్ వేశాడు.

హారిక అవుట్..
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇక ఇప్పటి వరకు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం.. అభిజిత్ విన్నర్ అయ్యాడు.. సోహెల్ రన్నర్‌గా నిలిచాడు. హారిక 5వ స్థానానికే పరిమితమై టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.