అందుకే అఖిల్‌తో అంత క్లోజ్, అభితో అలా.. ఆ యాంగిల్ కూడా ఉంది.. బయటపెట్టిన హారిక
బిగ్ బాస్ షోలో హారిక అభిజిత్ అఖిల్ మోనాల్ టాపిక్ లేకుండా గడిచిన ఒక్క ఎపిసోడ్ కూడా ఉండదు. ఈ నలుగురు షోకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా అంటూ అరియానా కూడా ఫేమస్ అయింది. అరియానాను ట్రోల్ చేసే వారున్నారు.. ప్రేమించే వారున్నారు. అయితే ఇందులో మాత్రం గత కొన్ని రోజలుగా హారిక వ్యవహారమే హాట్ టాపిక్ అవుతోంది. మొదటి నుంచి అభిజిత్‌తో క్లోజ్‌గా ఉంటూ వస్తోన్న హారిక ఈ మధ్యే మాత్రం రూటు మార్చేసింది. అఖిల్‌తో మీద పడిపోతోంది.. అతను కూడా ముద్దులు, హగ్గులు అంటూ వెంటపడుతూనే ఉన్నాడు.

గత మూడు నాలుగు వారాలుగా..
అభిజిత్ హారిక మధ్య దూరం పెరగడం, ఆ సమయంలోనే అఖిల్ మోనాల్‌కు మరింత దగ్గరవ్వడం వంటి ఘటనలతో షో కాస్త యూటర్న్ తీసుకుంది. నాగార్జున పీకిన క్లాస్‌కు హారిక దెబ్బకు మారిపోయింది. అభిజిత్‌కు దూరంగా ఉంటూ.. అఖిల్‌కు బాగా దగ్గరైంది. అయితే ఇందులో హారిక ఉద్దేశ్యం వేరేఉంది. అది నిన్నటి ఎపిసోడ్‌లో బయటకు వచ్చింది.

అలాంటి టాస్క్..
టాప్ 5 కంటెస్టెంట్లుగా ఇంట్లో ఉన్న వారికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరి మాస్క్ వారు తొలగించాలని, ఇన్నాళ్లలో వారు దాచుకున్న క్వాలిటీస్, వచ్చిన మార్పులు, చూపించని ఎమోషన్స్ గురించి చెబుతూ మాస్క్‌లు తీసేయాలని తెలిపాడు.

హారిక అలా..
హారిక తన టాస్క్‌లో భాగంగా తన గురించి చెప్పుకొచ్చింది. తనకు పొసెసివ్ నేచర్ ఉందని అభిజిత్ వల్ల తెలిసిందని, తాను కూడా ఫ్లర్ట్ చేయగలనని అఖిల్ వల్ల తెలిసిందంటూ తన మాస్క్ గురించి హారిక చెప్పుకొచ్చింది. అయితే ఈ పొసెసివ్, ఫ్లర్టింగ్ గురించి హారిక క్లియర్‌గానే చెప్పింది.

అందుకే అఖిల్‌తో..
అఖిల్ ఎప్పుడైతే ఫ్లర్ట్ చేయడం ప్రారంభించాడో.. తాను కూడా స్టార్ట్ చేశానని, మీరు మాత్రమే కాదు మేం కూడా ఫ్లర్ట్ చేయగలమని చెప్పేందుకే అలా చేశాననంటూ హారిక తెలిపింది. అందుకే ఇన్ని రోజులు అఖిల్‌తో హారిక అంత క్లోజ్‌గా ఉన్నట్టు చెప్పకనే చెప్పేసింది.
Recommended Video

అభిజిత్‌లో ఇలా..
అభిజిత్ వల్ల తనకు పొసెసివ్ ఉందని తెలిసిందంటూ హారిక చెప్పుకొచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంటే తనతోనే ఉండాలని, కానీ అభి మాత్రం మోనాల్,స్వాతి, అరియానా ఇలా అందరితో మాట్లాడే వాడని, ఆ సమయంలో తనకు పొసెసివ్ అనిపించిందంటూ హారిక అసలు విషయాన్ని బయట పెట్టేసింది.


Click it and Unblock the Notifications











