మనల్ని కూడా వదలడం లేదు.. అభిజిత్ పులిహోరపై హరితేజ కౌంటర్

బిగ్ బాస్ షోలో చివరి వారాన్ని కలర్‌ఫుల్‌గా నింపాలని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే గత సీజన్ల కంటెస్టెంట్లను పట్టుకొచ్చి టాప్ 5 ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేసేప్రోగ్రాం పెట్టించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా మొదటి సీజన్ నుంచి హరితేజ, రెండో సీజన్ నుంచి గీతా మాధురి, మూడో సీజన్ నుంచి శ్రీముఖి అలీరెజా వచ్చారు. ఈ నలుగురు ఇంట్లో ఉన్న ఐదుగురితో వర్చువల్‌గా మాట్లాడారు. టాప్ 5 కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారు వారి సీనియర్లు.

 మొదటగా అభిజిత్‌కు..

మొదటగా అభిజిత్‌కు..

అభిజిత్ మొదటగా తన సీనియర్ కంటెస్టెంట్లకు సోప్ వేయడం ప్రారంభించాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంతోముచ్చటేస్తుంది.. సంతోషంగా ఉందంటూ బిస్కెట్ వేయడం ప్రారంభించాడు. అలా అభిజిత్ సోపు వేస్తుంటే హరితేజ్ అదిరిపోయే కౌంటర్ వేసింది. మమ్మల్ని కూడా వదలేడం లేదంటూ అభిజిత్ పులిహోరపై సెటైర్ వేసింది.

అఖిల్ ఇద్దరితోనూ..

అఖిల్ ఇద్దరితోనూ..

మోనాల్ వెళ్లడం బాధపడుతున్నావా? అఖిల్ అంటూ గీతా మాధురి కౌంటర్ వేయగా.. అలాంటిదేమీ లేదంటూ అఖిల్ గాలి తీసేశాడు సోహెల్. ఆల్రెడీ ఇద్దరికి లైన్ వేస్తున్నాడంటూ అఖిల్ పులిహెర గురించి సోహెల్ కామెంట్ చేశాడు. అలా ఈ మాజీ కంటెస్టెంట్లు టాప్ 5 ఫైనలిస్ట్‌లను బాగానే ఆడుకున్నారు.

అరియానా లౌడ్ స్పీకర్..

అరియానా లౌడ్ స్పీకర్..

మొదటి సీజన్‌లో హరితేజ, మూడో సీజన్‌లో శ్రీముఖి ఎలా అరిచారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరికి లౌడ్ స్పీకర్లంటూ ట్యాగులు ఇచ్చారు. అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనల్ని అలా అన్నారు.. మనకంటే అరియానా మించిపోయిందంటూ ఆమె పరువుదీసేశారు.

రచ్చ రచ్చ..

రచ్చ రచ్చ..

అలా సీనియర్ కంటెస్టెంట్లు తమ జూనియర్లను బాగానే ఆట పట్టించారు. నేటి ఎపిసోడ్‌లో ఈ నలుగురే రచ్చ చేయనున్నట్టు కనిపిస్తోంది. ఫినాలే దగ్గరకు వస్తుండటంతో వారిలో జోష్ నింపేందుకు ఇంకా ఇలాంటివి బిగ్ బాస్ బాగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

Recommended Video

Sukumar High Voltage Story For Vijay Devarakonda Project
 ఓటింగ్ రచ్చ..

ఓటింగ్ రచ్చ..

ఇక టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఓటింగ్ రచ్చ జరుగుతోంది. అనధికారిక పోల్స్, సర్వేలంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. తమ తమ ఫేవరేట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయమంటూ అభిమానులు వీర లెవెల్‌లో ప్రచారాలు చేసుకుంటున్నారు. అరియానా సోహెల్ అభిజిత్ మధ్యే టైటిల్ పోరు ఉండేట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X