Don't Miss!
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- News బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
ఆ ముగ్గురు డేంజర్ జోన్లో.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్‌బాస్‌లో రెండో కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సమయం ఆసన్నమైంది. అయితే ఈ రెండో వారానికి గానూ తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మందిలో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారని, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే నిజంగానే డబుల్ ఎలిమినేష్ ఉంటుందా? ఇద్దరు బయటకు వెళ్తారా? అన్నది కాసేపు పక్కనపెడదాం. నామినేట్ అయిన తొమ్మిది మంది కంటెస్టెంట్ల పర్ఫామెన్స్, సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
పడవ ప్రయాణంలో మునిగారు..
రెండో వారానిని గానూ పెట్టిన నామినేష్ టాస్క్ అత్యంత నిరాశ కలిగింది. పడవ ప్రయాణం అంటూ టాస్క్ ఇవ్వగా ఎవరికి వారే తాము నామినేట్ అవుతామని దిగేశారు. ఓ వాగ్వాదం గానీ చర్చలుగానీ అంతగా పెట్టలేదు. గంగవ్వ, నోయల్, అభిజీత్, మోనాల్, హారిక, అమ్మ రాజశేఖర్, సోహెల్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి ఇలా తొమ్మిది నామినేషన్లో వచ్చి పడ్డారు.
తగ్గించుకున్న ఆ ఇద్దరు..
మొదటి వారంలో నోయల్, కరాటే కళ్యాణి కాస్త ఓవర్ చేశారు. అందరి అభిప్రాయాలను ప్రభావితం చేయడం, అన్నింట్లో దూరడం నోయల్ కాస్త తగ్గించుకున్నాడు. ఇక చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, ఏడుపులు, అరుపులు తగ్గించేసుకుంది కళ్యాణి.
బలమైన కంటెస్టెంట్లు..
నామినేషన్లో ఉన్న ఆ తొమ్మిది మందిలో నోయల్, గంగవ్వ, అభిజీత్, మోనాల్, హారిక ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్లు. ఈ ఐదుగురూ సేఫ్ జోన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఓటింగ్లోకూ వీరంతా ఎంతో ముందున్నారని సమాచారం. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్‌లోంచి తప్పించుకున్నట్టు టాక్.
ఆ ముగ్గురే డేంజర్..
మొదటి వారంలో వచ్చిన నెగెటివిటీ కొంచెం తగ్గినా కరాటే కళ్యాణి మాత్రం డేంజర్ జోన్లోనే ఉంది. ఇక అమ్మ రాజశేఖర్ అతి, కుళ్లు జోకులు, కావాలనే నటించడం, కృత్రిమంగా కలిసిపోయినట్టు అనిపించడంతో ఇతనూ డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. కనీసం కుమార్ సాయి ఉన్నాడన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. కుమార్ సాయికి ఓట్లు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది.
Recommended Video
గంగవ్వ పరిస్థితి..
ఈ వారం గంగవ్వ పరిస్థితి ఎలా అయిందో అందరికీ తెలిసిందే. గంగవ్వ ఆరోగ్యం బాగుండటం లేదు. వెళ్లిపోతా అని బిగ్‌బాస్‌కు మొరపెట్టుకుంది. అయితే అవ్వకు ఓట్లు భారీగానే వచ్చాయట.. కానీ గంగవ్వ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏదైనా జరగొచ్చనే టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరుగనుంది? ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న సంగతి తెలియాలంటే నేటి రాత్రి వరకు ఆగితే లీకులు ఎలాగో బయటకు వచ్చేస్తాయి.