‘బిగ్’లీక్.. అయ్యయ్యో ఎంత పనైంది.. రెండో వారంలో ఎలిమినేట్ అయింది ఎవరంటే?
బిగ్‌బాస్ షోలో ఎంత సర్ ప్రైజ్ మెయింటైన్ చేయాలంటే అంతగా లీకులు అవుతుంటాయి. ఒక్క మొదటి సీజన్‌లో తప్పా ప్రతీసారి బిగ్‌బాస్‌కు లీకుల బెడద తప్పనేలేదు. రెండు, మూడు సీజన్లలో వచ్చిన లీకులతో షో మీదున్న ఆసక్తి కూడా పోయేది. కంటెస్టెంట్ల ఎలిమినేషన్, నామినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలా ప్రతీ ఒక్కటీ లీకవుతూనే వస్తోంది. అదే సంప్రదాయం ఈ సారి కూడా కొనసాగింది. రెండో వారంలో ఎవరు బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు తమ సొంత గూటికి చేరుకోబోతోన్నారో లీకైంది.

నామినేషన్‌లో అలా..
రెండో వారానిని గానూ పెట్టిన నామినేష్ టాస్క్ మరీ పేలవంగా సాగింది. ఎవరికి వారే త్యాగమూర్తుల్లా పడవ దిగి నామినేట్ అయ్యారు. నామినేషన్ విషయాన్ని అందరూ తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండో వారానికి సంబంధించిన నామినేషన్‌లో గంగవ్వ, నోయల్, అభిజీత్, మోనాల్, హారిక, అమ్మ రాజశేఖర్, సోహెల్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి వంటి వారున్నారు.

వారు సేఫ్..
నోయల్, గంగవ్వ, అభిజీత్, మోనాల్, హారికలకు వారికి వారి సత్తా తెలిసినట్టుంది. అందుకే నామినేట్ అయినా కూడా సేవ్ అవుతామనే నమ్మకం ఉందేమో. అందుకే ఎవరితోనూ ఎలాంటి డిస్కషన్ పెట్టకుండా దిగేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ అయిన మరునాడు నుంచే సోషల్ మీడియాలో ఓ టాక్ నడిచింది.,

కరాటే కళ్యాణిపైనే గురి..
మొదటి వారంలో కరాటే కళ్యాణి చేసిన రచ్చ ఏ ఒక్కరూ మరిచిపోలేదు. ఊ అంటే ఏడ్వడం ఊ అంటే అరవడం మొదటి రెండు మూడు రోజులు ప్రేక్షకులను విసిగించేసింది. అయితే నాగార్జున చెప్పాక కాస్త తగ్గించుకుంది. రెండో వారంలో అంతగా గొడవలు పెట్టుకోలేదు.

అదే అభిప్రాయం..
అయితే రెండో వారంలో కరాటే కళ్యాణి అందర్నీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది. ఫస్ట్ వీక్‌లా ఏడుపులు, అరుపులు కాకుండా నవ్వించేందుకు ట్రై చేసింది. టాస్కులు కూడా బాగానే ఆడింది. బాగా నటించింది. అయితే ప్రేక్షకులు మాత్రం కరాటే కళ్యాణిని తిరస్కించినట్టు తెలుస్తోంది.

రెండో వారంలో ఇంటికి..
మాములూగా మొదటి వారంలో గనుక నామినేషన్‌లో ఉండుంటే అప్పుడ వెళ్లేది. కానీ కరాటే కళ్యాణికి ఇంకో వారం ఉండే అవకాశం వచ్చింది. కానీ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదేమోనని తెలుస్తోంది. ఓటింగ్‌లో బాగా వెనుకబడిపోవడంతో ఇంటికి పయనం కాకతప్పలేదని లీకులు ద్వారా సమాచారం బయటకు వచ్చేసింది. ఇక మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురుచూడాలి.


Click it and Unblock the Notifications











